ఉత్తరాది వెళ్లే వారికి శుభవార్త - కాచిగూడ నుంచి కొత్తగా వీక్లీ ఎక్స్‌ప్రెస్..! టైమింగ్స్, హాల్ట్ స్టేషన్ల లిస్ట్
SCR Weekly Train kacheguda Sri Ganganagar : రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. కాచిగూడ – శ్రీగంగానగర్ మధ్య వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును క్రమబద్ధీకరిస్తూ (రెగ్యులరైజ్) రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది.
SCR Weekly Train kacheguda Sri Ganganagar : ఉత్తరాది రాష్ట్రాలకు ప్రయాణించే తెలుగు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. సుదూర ప్రాంతాలకు ప్రయాణించే వారి సౌకర్యార్థం, గతంలో ప్రత్యేక రైలుగా నడిచిన కాచిగూడ – శ్రీగంగానగర్ వీక్లీ స్పెషల్ రైలు సర్వీసును రైల్వే మంత్రిత్వ శాఖ క్రమబద్ధీకరించింది. ఈ నిర్ణయంతో ప్రయాణికులకు మరింత మెరుగైన కనెక్టివిటీ, మెరుగైన ప్రయాణ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి.

రైలు నెంబర్ 07053/07054 తో నడిచిన వీక్లీ స్పెషల్ రైలు షెడ్యూల్‌ను మార్చారు. రెగ్యులర్ సర్వీసుగా మారుస్తూ టైమ్ టేబుల్‌ను విడుదల చేశారు. ఈ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసులు రానున్న జూలై నెల నుంచి పట్టాలెక్కనున్నాయి.
- ట్రైన్ నంబర్ 17601 (కాచిగూడ - శ్రీగంగానగర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్) : ఈ రైలు ప్రతి శనివారం కాచిగూడ నుంచి బయలుదేరుతుంది. ఈ రెగ్యులర్ సర్వీసు 2026, జూలై 25వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.
- ట్రైన్ నంబర్ 17602 (శ్రీగంగానగర్ - కాచిగూడ వీక్లీ ఎక్స్‌ప్రెస్) : ఈ రైలు ప్రతి మంగళవారం శ్రీగంగానగర్ నుంచి పయనమవుతుంది. ఈ రెగ్యులర్ సర్వీసు 2026, జూలై 28వ తేదీ నుంచి అందుబాటులోకి వస్తుంది.
టైమింగ్స్, హాల్టింగ్స్:
ఈ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ మీదుగా పంజాబ్/హర్యానా సరిహద్దుల్లోని శ్రీగంగానగర్ వరకు ప్రయాణిస్తుంది. కాచిగూడ నుంచి శనివారం రాత్రి 22.00 గంటలకు బయలుదేరి సోమవారం రాత్రి 21.30 గంటలకు శ్రీగంగానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో శ్రీగంగానగర్‌లో మంగళవారం ఉదయం 06.55 గంటలకు బయలుదేరి గురువారం ఉదయం 07.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
ఈ సుదీర్ఘ ప్రయాణంలో మల్కాజ్‌గిరి, కామారెడ్డి, నిజామాబాద్, బాసర, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణా, అకోలా, మల్కాపూర్, హర్దా, ఇటార్సి, భోపాల్, ఉజ్జయిని, కోట, జైపూర్, సికార్, చురు, బికనీర్, సూరత్‌గఢ్ మరియు శ్రీ కరణ్‌పూర్ వంటి ప్రముఖ రైల్వే స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి రాజస్థాన్‌లోని జైపూర్, బికనీర్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారికి ఈ రైలు ఎంతో అనుకూలంగా మారనుంది.
ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ రైలులో అన్ని రకాల కేటగిరీల కోచ్‌లను రైల్వే శాఖ అందుబాటులో ఉంచింది. ఈ రైలులో మొత్తం కోచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి:
- టూ టైర్ ఏసీ కోచ్‌లు (2A): 02
- త్రీ టైర్ ఏసీ కోచ్‌లు (3A): 08
- స్లీపర్ క్లాస్ కోచ్‌లు (Sleeper): 06
- జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు (General): 04
ఈ రైలుకు సంబంధించిన అదనపు సమాచారం, సీట్ల లభ్యత, టికెట్ బుకింగ్ వివరాల కోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ ను చూడొచ్చు. లేదా దక్షిణ మధ్య రైల్వే అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాలను సందర్శించవచ్చని అధికారులు తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

