రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్‌లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. సైబరాబాద్ ప్రాంతంలో ఐటీ కంపెనీలు, సంస్థలు నవంబర్ 3 నుండి 5 వరకు తమ ఉద్యోగులకు విడతల వారీగా ముందస్తు లాగౌట్ను అమలు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

హైదరాబాద్ నగరంలో మారుతున్న వాతావరణ పరిస్థితులు, నవంబర్ 5 వరకు మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు విభాగం కీలకమైన అడ్వైజరీని విడుదల చేసింది. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు తమ ఉద్యోగుల సురక్షత, రోడ్లపై ట్రాఫిక్ నివారణ, అత్యవసర సేవల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేయాలని తెలిపింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
వర్షాల వల్ల రోడ్లపై తీవ్రమైన ట్రాఫిక్ స్తంభించకుండా, రహదారులపై ఒత్తిడి తగ్గించేందుకు కంపెనీలు తమ ఉద్యోగులకు మధ్యాహ్నం 2 గంటల నుండి పద్ధతి ప్రకారం లాగౌట్‌లు ప్రారంభించాలి.
మధ్యాహ్నం నుండి రాత్రి వరకు వర్ష తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకునేలా సాయంత్రం 4 గంటల కల్లా లాగౌట్ ప్రక్రియను పూర్తి చేయాలి.
వర్షాలు ఉండే ఈ 3 రోజుల పాటు (నవంబర్ 3 నుండి నవంబర్ 5 వరకు) సాధ్యమైనంత వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్(Work From Home) వెసులుబాటు కల్పించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా పరిశీలించాలి.
నగరంలో వర్షాల సమయంలో ట్రాఫిక్‌ను సరిగ్గా నియంత్రించడానికి, అవసరమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించడానికి ఐటీ కంపెనీలు తమ ముందస్తు ప్రణాళికలను పోలీసులకు తెలియజేయాలని కోరారు. కంపెనీ ఉన్న ప్రాంతం, పాటించబోయే లాగౌట్ వేళల వివరాలను cybtrcc@gmail.com కు ఇమెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల భద్రత, ఎమర్జెన్సీ సేవల సజావు సాగడం కోసం ఐటీ కంపెనీలు, సంస్థలు పూర్తి సహకారం అందించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ కోరింది.
{{/usCountry}}నగరంలో వర్షాల సమయంలో ట్రాఫిక్‌ను సరిగ్గా నియంత్రించడానికి, అవసరమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించడానికి ఐటీ కంపెనీలు తమ ముందస్తు ప్రణాళికలను పోలీసులకు తెలియజేయాలని కోరారు. కంపెనీ ఉన్న ప్రాంతం, పాటించబోయే లాగౌట్ వేళల వివరాలను cybtrcc@gmail.com కు ఇమెయిల్ ద్వారా పంపాలని సూచించారు. ప్రజా శ్రేయస్సు, ఉద్యోగుల భద్రత, ఎమర్జెన్సీ సేవల సజావు సాగడం కోసం ఐటీ కంపెనీలు, సంస్థలు పూర్తి సహకారం అందించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ శాఖ కోరింది.
{{/usCountry}}మధ్యాహ్నం, రాత్రి వేళల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, కంపెనీలు మధ్యాహ్నం 2 గంటల నుండి విడతల వారీగా లాగౌట్లను ప్రారంభించి, వీలైతే సాయంత్రం 4 గంటలలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు కోరారు.