సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో ఆధునిక చికిత్సా విధానాలది కీలక పాత్ర
ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా సంతానలేమి చికిత్సలో జరుగుతున్న ఆధునిక అభివృద్ధి గురించి పలువురు వైద్యులు వివరించారు. సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని చెప్పారు.
కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్, హైదరాబాద్ బంజారాహిల్స్‌లో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంతానలేమి చికిత్సలో జరుగుతున్న ఆధునిక అభివృద్ధి, సమయానికి చికిత్స తీసుకోవడం ప్రాముఖ్యతపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా డా. నిమ్మ పూజా రెడ్డి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ అండ్ లాపరోస్కోపిక్ సర్జన్ మాట్లాడారు. ఆధునిక ఐవీఎఫ్ సాంకేతికతలతో విజయవంతమైన గర్భధారణ అవకాశాలు గణనీయంగా పెరిగాయని తెలిపారు. సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు ఆలస్యం చేయకుండా నిపుణులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.
డా. బి. సింధూర, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ అండ్ రీప్రొడక్టివ్ రీజెనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, పునరుత్పత్తి వైద్యం, రీజెనరేటివ్ థెరపీలలో జరుగుతున్న తాజా అభివృద్ధి గురించి వివరించారు. ఈ ఆధునిక చికిత్సా విధానాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నొప్పిలేని, సూదులు అవసరం లేని ఫెర్టిలిటీ చికిత్సలను ప్రవేశపెట్టిన తొలి ఫెర్టిలిటీ కేంద్రం కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ అని వైద్యులు పేర్కొన్నారు. ఈ వినూత్న చికిత్సా విధానం ద్వారా రోగుల్లో చికిత్సపై ఉండే భయం, ఆందోళన తగ్గి మరింత సౌకర్యవంతమైన అనుభవం కలుగుతోందని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు, రోగులతో వైద్య నిపుణులు ప్రత్యక్షంగా మమేకమై, సంతానలేమి, ఐవీఎఫ్ చికిత్సలపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. సరైన సమయంలో పరీక్షలు చేయించుకోవడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సంతానలేమి సమస్యలను సమర్థవంతంగా అధిగమించవచ్చని తెలిపారు. సంతానాన్ని ఆశించే దంపతులకు ఫెర్టిలిటీ ఆరోగ్యం, ముందస్తు నిర్ధారణ, అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చికిత్సా ప్రణాళికలు, వినూత్న వైద్య సేవలతో కిమ్స్ ఫెర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ సేవలను అందిస్తూ ముందంజలో కొనసాగుతోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


