...
...
Next Story

Weather Forecast : తెలంగాణకు వర్ష సూచన.. హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన వాన

Telangana Weather Forecast : తెలంగాణలో రాబోయే రోజుల్లో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) హైదరాబాద్‌ అంచనా వేసింది. గురు, శుక్రవారాల్లో తెలంగాణలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

Published on: Sep 17, 2026, 11:39:51 IST
Advertisement

తెలంగాణలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

తెలంగాణలో వర్షం
తెలంగాణలో వర్షం

వాతావరణ శాఖ హైదరాబాద్ నగరంలో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. సెప్టెంబర్ 20 ఆదివారం వరకు బలమైన గాలులతో కూడిన ఉరుములతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఇదే సమయంలో కచ్చితమైన వాతావరణ అంచనాలు అందించే.. తెలంగాణ వెదర్ మ్యాన్ తన ఎక్స్‌ ఖాతాలో తెలంగాణలో సెప్టెంబర్ 17, 18 తేదీల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాల హెచ్చరిక అని పోస్ట్ చేశారు. హైదరాబాద్ సిటీలో రాత్రి వేళల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

'తెలంగాణ ప్రజలారా, రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా రెడ్ మార్క్ చేసిన జిల్లాల్లో రాత్రి, ఉదయపు వేళల్లో సంభవించబోయే తీవ్రమైన ఉరుములతో కూడిన తుఫానులకు సిద్ధంగా ఉండండి. పగటిపూట తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో కూడిన వాతావరణం ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వరకు అక్కడక్కడా మాత్రమే తుపానులు వచ్చే అవకాశం ఉంది . అయితే రాత్రి వేళల్లో వాతావరణం వేగంగా మారి, వివిధ ప్రాంతాల్లో తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షాలు సంభవించే అవకాశం ఉంది.' అని తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.

ఇక ఈసారి వర్షపాతం తక్కువగానే ఉంది. ప్రస్తుత నైరుతి రుతుపవనాల కాలంలో తెలంగాణలో సాధారణంగా కురవాల్సిన 664.5 మి.మీ. వర్షపాతానికి బదులుగా ఇప్పటివరకు 536.5 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఇది 19 శాతం వ్యత్యాసం. హనుమకొండ జిల్లా పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇక్కడ సాధారణ వర్షపాతం 729.8 మి.మీ కాగా, కేవలం 422.5 మి.మీ మాత్రమే నమోదైంది. అంటే ఇది సాధారణం కంటే 42 శాతం తక్కువ. ఇతర జిల్లాలు కూడా దీనికి ఏమాత్రం తీసిపోలేదు. వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం, జనగాం, యాదాద్రి భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం జిల్లాల్లో వర్షపాతం లోటు 30 శాతానికి పైగా నమోదైంది. హైదరాబాద్ నగరంలో కూడా సాధారణ వర్షపాతం 550.8 మి.మీ కాగా, 432 మి.మీ వర్షం నమోదైంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks