...
...
Next Story

వాట్సాప్‌ మీసేవలో మరిన్ని జీహెచ్‌ఎంసీ సర్వీసులు.. కొత్తగా తొమ్మిది సేవలు

వాట్సాప్‌ మీసేవలో మరిన్ని జీహెచ్‌ఎంసీ సేవలు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా తొమ్మిది పౌర సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం. డిజిటల్‌ సేవలను మరింత విస్తరించింది.

Updated on: May 19, 2026 05:33 PM IST
Advertisement

జీహెచ్‌ఎంసీకి సంబంధించిన పౌర సేవలను కొత్తగా మీసేవ వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా తెలంగాణ ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజలకు మరింత సౌకర్యం, అందుబాటు, పారదర్శకత కల్పించే దిశగా ఈ సేవలను విస్తరించారు. ఈ మేరకు ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం ఒక ప్రకటన విడుదల చేసింది.

మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ
మూడు కార్పొరేషన్లుగా జీహెచ్ఎంసీ

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నాయకత్వంలో మీసేవ ద్వారా పౌర సేవలను మరింతగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్‌ సేవల ప్రధాన వేదికగా ఉన్న మీసేవను వాట్సాప్‌, చాట్‌బాట్‌ ద్వారా మరింత విస్తరించారు. ఈ అదనపు డిజిటల్‌ ఛానల్‌ను 2025 నవంబర్‌ 18న ప్రారంభించారు.

కొత్తగా జీహెచ్‌ఎంసీ ప్రాపర్టీ అసెస్‌మెంట్‌ రివిజన్‌, జనన ధ్రువీకరణ సవరణ, మరణ ధ్రువీకరణ సవరణ, బర్త్‌ హోమ్‌(ఇంటి దగ్గర పుట్టిన), డెత్‌ హోమ్‌(ఇంటి దగ్గర చనిపోయిన), ప్రాపర్టీ డోర్‌ నంబర్‌ సవరణ, ప్రాపర్టీ పేరు సవరణ, ప్రాపర్టీ ట్యాక్స్‌ సేవలు, ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ సేవలను వాట్సాప్‌ మీసేవలో చేర్చారు.

రాష్ట్రవ్యాప్తంగా పౌరులు ఈ సేవలను వాట్సాప్‌ ద్వారానే పొందవచ్చని ఎలక్ట్రానిక్‌ సర్వీస్‌ డెలివరీ విభాగం తెలిపింది. సేవలు పొందేందుకు ముందుగా 8096958096 నంబర్‌ను మొబైల్‌లో ‘MeeSeva Telangana’ పేరుతో సేవ్‌ చేసుకోవాలి. అనంతరం వాట్సాప్‌లో ఆ నంబర్‌కు ‘Hi’ సందేశం పంపాలి. అవసరమైన సేవ పేరు టైప్‌ చేసి, మెనూలో కనిపించే ‘Open Service’ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. ఫారంలో అడిగిన వివరాలు, చెల్లింపు పూర్తిచేస్తే దరఖాస్తు వెంటనే వాట్సాప్‌ ద్వారా నమోదవుతుంది.

డిజిటల్‌ సేవలను నిరంతరం విస్తరించడం, ప్రభుత్వ వ్యవస్థల విశ్వసనీయతను బలోపేతం చేయడం, పౌరులకు సులభమైన అనుభవం కల్పించడం తమ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe