హైదరాబాద్ లో నైట్ ఎకానమీతో యువకులకు ఉపాధి అవకాశాలు - స్టాల్స్ ఏర్పాటుపై సీఎం రేవంత్ ఆదేశాలు

ఒల్డ్ సిటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ పునురుద్ఘాటించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు.

Published on: Mar 9, 2026, 07:09:53 IST
PTI | By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టులో భాగంగా నది పరివాహక ప్రాంతాన్ని నైట్ ఎకానమీ కొనసాగే విధంగా అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫలితంగా ఈ ప్రాంతంలోని యువకులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

హైదరాబాద్ శివరాంపల్లిలో హైడ్రా ఆధ్వర్యంలో పునరుద్ధరించి అత్యంత సుందరంగా తీర్చిదిద్దిన బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ…. ప్రజలకు అద్భుతమైన సంస్కృతిని అందించడానికి బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువును పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని చెప్పారు. హైదరాబాద్‌లో చెరువులను పునరుద్ధరించిన ప్రాంతాల్లో నైట్ ఎకానమీ కొనసాగే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.

సీఎం రేవంత్ ప్రసంగం - ముఖ్యమైన అంశాలు:

  • “స్థానిక పౌరులకు మంచి వాతావరణం కల్పించాం. ఇక్కడ ఆడబిడ్డలు స్వేచ్ఛగా ఉదయం, సాయంత్రం సమయాల్లో వాకింగ్ చేసుకోవడానికి ఇక్కడ లేక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. అలాగే, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ఈ లేక్స్ వద్ద స్టాల్స్ పెట్టి స్థానికులు పాలు, పండ్లు, కూరగాయలు పరిశుభ్రమైన వాతావరణంలో అమ్ముకోవడానికి వీలు కల్పిస్తాం.
  • 99 రోజుల ‘ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా హైదరాబాద్‌లో అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఒకప్పుడు హైదరాబాద్ రాక్స్, లేక్స్ తో ప్రపంచంలోనే సుందరమైన నగరంగా ఉండింది. ఈ నగరం మనది. దీన్ని రక్షించుకోవలసిన బాధ్యత కూడా అందరిపైన ఉంది.
  • ఈ మహానగరానికి పూర్వ వైభవం తీసుకురావాలన్న సంకల్పంతో ఆక్రమణలకు గురైన చెరువులు, నాలాలను తొలగించే కార్యక్రమం చేపట్టాం.
  • ఇది ఓల్డ్ సిటీ కాదు. ఒరిజినల్ సిటీ. ఈ సిటీని అభివృద్ధి చేయడానికి అనేక ప్రాజెక్టులు చేపట్టాం. రెండు రోజుల కిందట కొత్వాల్‌గూడ్ ఎకో పార్క్‌ను ప్రారంభించుకున్నాం.
  • సాధ్యమైన తొందరగా మెట్రో విస్తరణ పనులను పూర్తి చేస్తాం. మిరాలం ట్యాంక్ బ్రిడ్జి పనులు ప్రారంభమయ్యాయి. పక్కనే హైకోర్టు నూతన భవన నిర్మాణం సాగుతోంది. ఉస్మానియా ఆసుపత్రిని నిర్మిస్తున్నాం.
  • హైదరాబాద్ అత్యంత పురాతన, ప్రాముఖ్యత కలిగిన నగరం. ఆ ప్రాభవం కోల్పోయే ప్రమాదం ఉంది. దీన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాం. బతుకమ్మ కుంటను అభివృద్ధి చేశాం. ఏడాది కిందట బుమ్-రుక్న్-ఉద్-దౌలా చెరువు ఎలా ఉంది. ఇప్పుడేలా ఉంది. గమనించాలి.
  • ఈ ఒరిజినల్ సిటీని అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న పనులను చూడండి. ఆ పనులను చూసి ప్రభుత్వానికి మద్దతుగా నిలవండి..” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ఈ సందర్బంగా ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More