ఏపీ నుంచి హైదరాబాద్ వచ్చే వారికి అలర్ట్ - సాఫీగా వెళ్లేందుకు ఈ రూట్స్ ప్లాన్ చేసుకోండి

సంక్రాంతి వేళ విజయవాడ - హైదరాబాద్ హైవేపై భారీగా రద్దీ నెలకొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సొంత ఊర్లలోకి వెళ్లిన ప్రజలు… పండగ తర్వాత తిరిగి నగరానికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు నల్గొండ జిల్లా పోలీసులు కీలక సూచనలు చేశారు.

Published on: Jan 16, 2026, 11:08:24 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

సంక్రాంతి పండగ పూర్తి కావొస్తొంది. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి హైదరాబాద్ వైపునకు భారీగా వాహనాలు తరలిరానున్నాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రద్దీ నివారణపై నల్గొండ జిల్లా పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇందుకోసం ముందస్తు రోడ్ మ్యాప్ ను ప్రకటించారు. ఫలితంగా వాహనదారులు ఇబ్బందులు లేకుండా సాఫీగా వెళ్లిపోవచ్చని సూచించారు.

విజయవాడ - హైదరాబాద్ హైవే (image from @ddyadagirinews X Account)
విజయవాడ - హైదరాబాద్ హైవే (image from @ddyadagirinews X Account)

విజయవాడ - హైదరాబాద్ (నేషనల్ హైవే- 65) మార్గ మధ్యంలోని చిట్యాల, పెద్ద కాపర్తి వద్ద ప్లై ఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ట్రాఫిక్ సమస్య నెలకొంటోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను సూచిస్తున్నట్లు నల్గొండ జిల్లా పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ఈ రూట్స్ తెలుసుకోండి :

1) గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : గుంటూరు నుంచి హైదరాబాద్ వచ్చే వాహనదారులు మిర్యాలగూడ, హాలియా, కొండమల్లేపల్లి, చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.

2) మాచర్ల నుంచి హైదరాబాద్ వెళ్లే వాహనాలు : మాచర్ల, నాగార్జునసాగర్, పెద్దవూర, కొండమల్లెపల్లి , చింతపల్లి, మాల్ మీదుగా వెళ్లొచ్చు.

3) నల్లగొండ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలు : నల్లగొండ, మార్రిగూడ బై పాస్, మునుగోడు, నారాయణపూర్, చౌటుప్పల్ (ఎన్.హెచ్ 65)మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.

4.) విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే భారి వాహనాలు… కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడ, హాలియా,చింతపల్లి, మాల్ మీదుగా హైదరాబాద్ వెళ్లొచ్చు.

5). ఎన్. హెచ్ 65 (విజయవాడ -హైదరాబాద్ )రహదారి పై చిట్యాల,పెద్దకాపర్తిలో ప్లై ఓవర్ నిర్మాణాలు జరుగుతున్నందున ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలుంటున్నాయి. ఈ సమస్య లేకుండా వెళ్లాలనుకునేవారు… చిట్యాల నుంచి భువనగిరి వైపునకు వెళ్లాలి. అక్కడ్నుంచి ఘట్ కీసర్, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా హైదరాబాద్ చేరుకోవచ్చు.

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ… సంక్రాంతి పండగ పూర్తి చేసుకున్న ప్రజలంతా తమ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుకోవాలన్నదే పోలీస్ శాఖ లక్ష్యమన్నారు.

"ట్రాఫిక్ రద్దీ కారణంగా ఎలాంటి అసౌకర్యాలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికతో దారి మళ్లింపు చర్యలు అమలు చేస్తున్నాం. ప్రయాణికులు పోలీస్ శాఖ సూచించిన మార్గాలను అనుసరించండి. ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, ఓర్పుతో ప్రయాణించాలి. రోడ్డు భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం” అని సూచించారు.

పండగ రోజుల్లో ట్రాఫిక్ పోలీసులు కీలక కూడళ్ల వద్ద విధులు నిర్వహిస్తున్నారని ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేర్కొన్నారు. డ్రోన్ కెమెరాలు, సీసీటీవీ నిఘాతో ట్రాఫిక్ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని వివరించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా డయల్ 100ని సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More