...
...
Next Story

ఎట్టకేలకు ఆగస్టులో అందుబాటులోకి రానున్న నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్!

హైదరాబాద్ నుంచి నల్గొండ వైపు వెళ్లేవారికి ట్రాఫిక్ కష్టాలు తప్పనున్నాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లై ఓవర్ ఆగస్టులో ప్రారంభం కానుంది.

Published on: Jul 9, 2026, 11:55:37 IST
Advertisement

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకంలో భాగంగా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నల్గొండ ఎక్స్ రోడ్స్ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమవుతోంది. అడ్డంకులను అధిగమించి, సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ ఫ్లైఓవర్‌ను వచ్చే ఆగస్టు నెలలో ప్రారంభానికి అధికారులు సర్వం సిద్ధం చేస్తున్నారు.

ప్రతీకాత్మక చిత్రం (Gemini AI)
ప్రతీకాత్మక చిత్రం (Gemini AI)

నల్గొండ ఎక్స్ రోడ్స్ నుండి ఒవైసీ హాస్పిటల్ జంక్షన్ వరకు ప్రయాణించే వాహనదారులకు ఈ ఫ్లైఓవర్ ఒక వరంలా మారనుంది. సుమారు 2.8 కిలోమీటర్ల పొడవుతో, నాలుగు లేన్లతో నిర్మిస్తున్న ఈ ఫ్లైఓవర్‌ ప్రయాణికులకు ఎలాంటి సిగ్నల్స్ లేకుండా సాఫీగా సాగిపోయే మార్గం సుగమం కానుంది.

జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ.కేర్ణన్, చీఫ్ ఇంజనీర్ రత్నాకర్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి ప్రాజెక్ట్ స్థలాన్ని స్వయంగా సందర్శించారు. నిర్మాణ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. ప్రస్తుతం జరుగుతున్న సివిల్, ఫినిషింగ్ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఆగస్టు మొదటి వారానికల్లా మిగిలిపోయిన అన్ని పనులను పూర్తి చేయాలని కాంట్రాక్ట్ ఏజెన్సీలను ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా ఫ్లైఓవర్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఈ ఫ్లైఓవర్ చంచల్‌గూడ వద్ద ప్రారంభమై, సంతోష్ నగర్‌లోని యాదగిరి థియేటర్ సమీపంలో ముగుస్తుంది. ప్రయాణికుల సౌకర్యార్థం సైదాబాద్ వద్ద అప్-ర్యాంప్ (పైకి వెళ్లే మార్గం), ఐఎస్ సదన్ వద్ద డౌన్-ర్యాంప్ (కిందికి దిగే మార్గం)లను ఏర్పాటు చేశారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe