Nallamala Saleswaram Jathara 2026 : నల్లమల అడవుల్లో సలేశ్వరం జాతర - తేదీలు ఖరారు, ఎలా చేరుకోవాలంటే..?

Nallamala Saleshwaram Jathara 2026 : అచ్చంపేట నల్లమల అడవుల్లో 'తెలంగాణ అమర్‌నాథ్'గా పేరొందిన సలేశ్వరం జాతర ఏప్రిల్ 2 నుండి 6 వరకు జరగనుంది. దక్షిణ భారత అమర్ నాథ్ యాత్రగా పరిగణించే ఈ ఉత్సవాల్లో చెంచులే పూజారులుగా వ్యవహరించడం ప్రత్యేకత.

Published on: Mar 24, 2026, 11:39:07 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నల్లమల అడవుల్లో కొలువైన సలేశ్వర క్షేత్రం ఉత్సవాలకు సిద్ధమవుతోంది. ఈ మేరకు జాతర తేదీలు ఖరారయ్యాయి. ఏప్రిల్ 2 నుంచి ప్రారంభమయ్యే ఈ జాతర… ఏప్రిల్ 6వ తేదీతో ముగియనుంది. ఈ మేరకు అధికారులు, పోలీసులు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

సలేశ్వరం జాతర (ఫైల్ ఫొటో)
సలేశ్వరం జాతర (ఫైల్ ఫొటో)

తెలంగాణ అమర్‌నాథ్ యాత్రగా….

'తెలంగాణ అమర్‌నాథ్' యాత్రగా పేరొందిన సలేశ్వరం జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. కృష్ణానది నుంచి జాలువారే జలపాతాల అలలతో పాటు అటవీ అందాలను వీక్షిస్తూ… యాత్ర ముందుకు సాగుతోంది. ఎత్తైన కొండల నడుమ వెయ్యడుగుల లోయలో కొలువైన పురాతన సలేశ్వర క్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎంతో ఉత్సాహంగా వెళ్తుంటారు. ‘వస్తున్నాం… వస్తున్నాం లింగమయ్య’ అంటూ నినాదాలు చేస్తుంటారు.

ఎలా చేరుకోవాలంటే…?

ఈ జాతరకు వచ్చే భక్తులను ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అడవిలోకి అనుమతి ఇస్తారు. ప్రతి ఏడాది ఓసారి ఇక్కడ జాతర జరుగుతోంది. ఈ జాతర ఉగాది వెళ్లిత తర్వాత తొలిచైత్రపౌర్ణమికి మొదలౌతుంది. ఇది నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అడవులలో ఉంటుంది. శ్రీ శైలం – హైదరాబాద్ వెళ్లే రహదారిలో శ్రీశైలం అటవీ ప్రాంతంలో శ్రీశైలం దారినుండి పక్కదారిలో ఫరహబాద్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది.

శ్రీశైలనికి 60 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. అడవిలో నుంచి ఫరహబాద్ మీదుగా 30 కిలో మీటర్ల వరకు వాహన ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఇందులో 30 కిలో మీటర్లు వాహన ప్రయాణం…. అక్కడ్నుంచి నుంచి 5 కిలో మీటర్లు కాలినడకన వెళ్లాల్సి ఉంటుంది.

ఈ సలేశ్వర క్షేత్రంలో ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు. ప్రతి ఏడాది 3 రోజులు మాత్రమే ఈ అడవిలోకి అనుమతి ఉంటుంది. హైదరాబాద్ నుండి వచ్చేవారు 130 కి.మీ. జర్నీ చేయాల్సి ఉంటుంది. ప్రకృతి ఒడిలో సాగే ఈ అద్భుతమైన జాతరకు ఎంతో విశిష్టత ఉంది. ఇక్కడి జలపాతంలో ఉండే నీటికి ఔషధ గుణాలు ఉంటాయని భక్తులు నమ్ముతారు. బాటిల్స్ లో ప్రత్యేకంగా తీసుకెళ్తుంటారు.

ఈ జాతరకు వచ్చే భక్తులు ఇరుకైన లోయలో జాగ్రత్తగా నడవాల్సి ఉంటుంది. కర్రల సాయంతో ముందుకెళ్లాలి. స్థానిక చెంచులే ఇక్కడ పూజారులుగా వ్యవహరిస్తారు. సలేశ్వరం జాతరకు వచ్చే భక్తులు అటవీ పరిసరప్రాంతాల్లో ప్లాస్టిక్ వాడకం, బీడీ, చుట్ట, సిగరేట్ కాల్చడాన్ని పూర్తిగా నిషేధించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More