నేపాల్‌ను ముంచెత్తిన ఆకస్మిక జలప్రళయం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆందోళనను రేకెత్తిస్తోంది. విహారయాత్ర కోసం హైదరాబాద్ నుంచి నేపాల్ వెళ్లిన 156 మంది తెలుగు పర్యాటకుల బృందంలో ఏకంగా 140 మంది జాడ తెలియకుండా పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. హిమాలయ పర్వత ప్రాంతాల్లో కురిసిన కుండపోత వర్షాలకు భోటేకోశీ నది ఉదయం ఉగ్రరూపం దాల్చడంతో ఈ ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రకృతి విపత్తు ధాటికి నేపాల్ వ్యాప్తంగా ఇప్పటివరకు 95 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది.

హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రముఖ ప్రైవేట్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఏజెన్సీ ద్వారా తెలుగు రాష్ట్రాలకు చెందిన 156 మంది పర్యాటకులు నేపాల్ పర్యటనకు వెళ్లారు. మంగళవారం రాత్రి వీరంతా అక్కడి ఒక హోటల్‌లో బస చేశారు. బుధవారం ఉదయం స్థానిక సందర్శనీయ ప్రాంతాలను చూడటానికి 140 మంది పర్యాటకులు బస్సుల్లో బయటకు వెళ్లారు. అయితే స్వల్ప అనారోగ్యం, ప్రయాణ అలసట కారణంగా 16 మంది యాత్రికులు హోటల్ గదుల్లోనే ఉండిపోయారు.
అయితే వారు బయటకు వెళ్లిన కొద్దిసేపటికే భోటేకోశీ నది తీర ప్రాంతంలో ఒక్కసారిగా మేఘావృతమై, ఆకస్మిక వరదలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడటంతో పాటు నదీ ప్రవాహం రోడ్లను, వంతెనలను తుడిచిపెట్టేసింది. బయటకు వెళ్లిన 140 మంది యాత్రికులతో కమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది.
నెట్‌వర్క్ టవర్లు కూలిపోవడం, కొండచరియలు విరిగిపడటంతో వారి ఫోన్లు అన్నీ స్విచ్ఛాఫ్ వస్తున్నాయి. దీంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని వారి కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో వారి కుటంబ సభ్యులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. అయితే నెట్‌వర్క్ లేక ఫోన్లు స్విచ్ఛాఫ్ అని వస్తుంది. ఎక్కడో ఒక దగ్గర తెలుగు ప్రయాణికులు సురక్షితంగా ఉండి ఉంటారని అంటున్నారు.
హోటల్లోనే ఉండిపోయిన 16 మంది మాత్రం సురక్షితంగా ఉన్నారు. గదిలో ఉన్న వారిలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నలుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమ వారి ఆచూకీ తెలియక పర్యాటకుల కుటుంబ సభ్యులు టూర్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు. నేపాల్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి తెలుగు పర్యాటకులను సురక్షితంగా తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
{{/usCountry}}హోటల్లోనే ఉండిపోయిన 16 మంది మాత్రం సురక్షితంగా ఉన్నారు. గదిలో ఉన్న వారిలో ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నలుగురు యాత్రికులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. తమ వారి ఆచూకీ తెలియక పర్యాటకుల కుటుంబ సభ్యులు టూర్ ఏజెన్సీ కార్యాలయానికి ఫోన్లు చేస్తున్నారు. నేపాల్‌లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి తెలుగు పర్యాటకులను సురక్షితంగా తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.
{{/usCountry}}నేపాల్ సైన్యం, స్థానిక సహాయక బృందాలు వరద ప్రభావిత ప్రాంతాల్లో హెలికాప్టర్ల ద్వారా గాలింపు చర్యలు వేగవంతం చేశాయి. కేంద్ర విదేశాంగ శాఖ కూడా నేపాల్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోంది.