...
...
Next Story

తల్లీబిడ్డల ఆత్మహత్యల కేసు.. సూసైడ్ చేసుకునేలా ఎవరైనా ప్రేరేపించారా?

Charlapalli Mother and Childrens Suicide : కొన్ని రోజుల కిందట చర్లపల్లి సమీపంలోని రైల్వే ట్రాక్ మీద తల్లీబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.

Published on: Apr 13, 2026, 17:42:18 IST
Advertisement

హైదరాబాద్ చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద కొన్ని రోజుల క్రితం తల్లీబిడ్డలు ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది. వీరి ఆత్మహత్యలపై ఎంతోమంది రకరకాలుగా విశ్లేషణ చేశారు. ఒంటరిగా ఉండటం వలన విజయారెడ్డి సూసైడ్ చేసుకునేవైపు ఆలోచనలు చేసిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా పిల్లల జీవితాలను అన్యాయం చేశారని కూడా కొందరు వ్యాఖ్యలు చేశారు.

చర్లపల్లి తల్లీబిడ్డల ఆత్మహత్యల కేసు
చర్లపల్లి తల్లీబిడ్డల ఆత్మహత్యల కేసు

ఇవన్నీ పక్కనపెడితే.. తాజాగా ఈ కేసు మరో మలుపు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ ముగ్గురి ఆత్మహత్యలకు గల కారణం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఎందుకు చనిపోయారు? అనే విషయంపై ఎవరికీ క్లారిటీ లేదు. కేసు దర్యాప్తులో లోపాలు ఉన్నాయంటూ కూడా విమర్శలు వచ్చాయి. రైల్వే పోలీసులను సైతం ప్రలోభాలకు గురి చేశారని ఆరోపణలు చేశారు కొందరు. ఇలాంటి సమయంలో బాధితురాలి భర్త పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ కేసుపై మరింత ఆసక్తి నెలకొన్నది.

మేడ్చల్ జిల్లా బోడుప్పల్‌లోని హరితవనం కాలనీలో సురేందర్ రెడ్డి, విజయారెడ్డి దంపతులు నివాసం ఉండేవారు. వీరికి కుమారుడు విశాల్ రెడ్డి, కుమార్తె్ చేతన ఉన్నారు. సురేందర్ రెడ్డి దుబాయ్‌లో జాబ్ చేస్తూ.. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ పోతుండేవారు.

జనవరి 30వ తేదీ రాత్రి విజయారెడ్డి, తన ఇద్దరు పిల్లలు చర్లపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన అప్పట్లో సంచలనమైంది. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా, టీమ్ లీడర్‌గా పని చేస్తున్న విజయారెడ్డి, ఇంటర్ చదివే తన పిల్లను సూసైడ్ చేసుకునేందుకు ఎలా ఒప్పించింది? అని ఎవరికీ అర్థంకాలేదు. ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరైనా వారిని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారా? లేదంటే ఒంటరితనం తట్టుకోలేని విజయారెడ్డి పిల్లలను తీసుకుని వెళ్లి సూసైడ్ చేసుకున్నారా? ఇలాంటి ప్రశ్నలు అందరికి వచ్చాయి.

ఆస్తులను కొట్టేయడానికి భారీ కుట్ర జరిగిందని, ఇందుకు సంబంధించి కొన్ని ఆధారాలు సేకరించాడు. అంతేకాదు వెళ్లి.. మేడిపల్లి పోలీసులను ఆశ్రయించాడు. తనకు ప్రాణ హాని ఉందని, తన భార్య, పిల్లలు మృతి వెనక కుట్ర ఉందని పేర్కొన్నాడు. తన భార్య విజయారెడ్డి సంపాదించిన రూ.కోట్ల ఆస్తులను దొంగిలించారంటూ.. పోలీసులకు చెప్పాడు. కొన్ని అనుమానాలు వ్యక్తం చేశాడు.

సురేందర్ రెడ్డి అనుమానాలు

  • విజయారెడ్డికి డైరీ రాసే అలవాటు ఉంది. ఆ డైరీ కనిపించడం లేదు. ఐఫోన్‌ కూడా మాయమైంది. కిటికీ వద్ద కాగితాలు కాల్చేసిన ఆనవాళ్లు ఉన్నాయి. ఆత్మహత్యకు గల కారణాలపై సూసైడ్‌ లేఖ అయి ఉండే అవకాశాలున్నాయని అనుమానాలు వ్యక్తం చేశాడు.
  • చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో ఉన్న కారును కూడా రైల్వే పోలీసుల సహకారంతో తీసేసుకున్నారు. ఇందులో కూడా ఏదైనా అనవాళ్లు ఉండే అవకాశం ఉందని సురేందర్ రెడ్డి చెబుతున్నాడు.
  • బోడుప్పల్‌లోనే భార్య, పిల్లల అంత్యక్రియలను నిర్వహించాలనుకున్నాడు. కానీ దుబాయ్ నుంచి వచ్చేసరికి మృతదేహాలను విజయారెడ్డి పుట్టింటివారు.. సురేందర్ రెడ్డి గ్రామానికి తరలించారు.
  • మృతదేహాలను గ్రామానికి తీసుకెళ్తున్న క్రమంలో బోడుప్పల్ ఇంట్లో ఉన్న కోటిన్నర విలువైన బంగారం, ఆస్తి పత్రాలు, ఇతర విలువైన డాక్యుమెంట్లు మాయమయ్యాయి.
  • ఈ సందర్భంగా విజయారెడ్డి తల్లిపై సురేందర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశాడు. కూతురు, మనమడు, మనవరాలు చనిపోయిందనే బాధకంటే.. ఆస్తిని ఎలా దక్కించుకోవాలనే విషయంపై ఆమె తల్లి ఫోకస్ చేసిందని చెప్పాడు.జనవరి 29వ తేదీన ఇంట్లో ఏం జరిగిందనేదానిపై అనుమానాలున్నాయని సురేందర్ రెడ్డి అన్నాడు. ఆస్తి విషయంలో విజయారెడ్డిని బెదిరించి.. ఇబ్బంది పెట్టి ఉంటారని చెప్పాడు.

అంతేకాదు ఆస్తి అంతా ఎవరికి వెళ్తుందని, వెంటనే సెటిల్ చేసుకోమని తనకు బెదిరింపులు వస్తున్నాయని సురేందర్ రెడ్డి చెప్పాడు. తనకు ప్రాణహాని ఉందని కూడా మేడిపల్లి పోలీసులకు వివరించాడు. అవసరం అయితే బందోబస్తు ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఈ కేసు దర్యాప్తు గురించి పోలీసులు వివరాలు వెల్లడించాల్సి ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe