...
...
Next Story

హైదరాబాద్ NFCలో 106 అప్రెంటిస్ ఖాళీలు - స్టైఫండ్, దరఖాస్తు వివరాలివే

NFC Hyderabad Apprentice Recruitment : హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ జారీ అయింది. 2026-27 సంవత్సరానికి గాను 106 డిప్లొమా, గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను స్వీకరిస్తోంది.

Published on: Aug 31, 2026, 08:05:06 IST
Advertisement

NFC Hyderabad Apprentice Recruitment : కేంద్ర ప్రభుత్వ అణుశక్తి శాఖకు చెందిన హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (NFC) నుంచి అప్రెంటిస్ నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఒక సంవత్సరం వ్యవధితో కూడిన అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మొత్తం 106 ఇంజినీరింగ్ డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఖాళీలున్నాయి.

ఖాళీల వివరాలు….

హైదరాబాద్ NFC లో 106 ఇంజినీరింగ్ అప్రెంటిస్ ఖాళీలు
హైదరాబాద్ NFC లో 106 ఇంజినీరింగ్ అప్రెంటిస్ ఖాళీలు

మొత్తం 106 ఖాళీలలో డిప్లొమా అభ్యర్థులకు 79, గ్రాడ్యుయేట్ అభ్యర్థులకు 27 కేటాయించారు.

డిప్లొమా (ఇంజినీరింగ్) అప్రెంటిస్ (మొత్తం 79 ఖాళీలు, నెలవారీ స్టైపెండ్: రూ. 10,900). విభాగాల వారీగా ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి….

  • మెకానికల్ ఇంజినీరింగ్: 39
  • కెమికల్ ఇంజినీరింగ్: 13
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 14
  • సివిల్ ఇంజినీరింగ్: 4
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 4
  • మెటలర్జికల్ ఇంజినీరింగ్: 3
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 2

గ్రాడ్యుయేట్ (ఇంజినీరింగ్) అప్రెంటిస్ (మొత్తం 27 ఖాళీలు, నెలవారీ స్టైపెండ్: రూ. 12,300). విభాగాల వారీగా ఖాళీలు ఇలా…

  • మెకానికల్ ఇంజినీరింగ్: 16
  • ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్: 4
  • ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్: 3
  • కెమికల్ ఇంజినీరింగ్: 2
  • కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్: 2

గతంలో లేదా ప్రస్తుతం ఎక్కడైనా అప్రెంటిస్‌షిప్ చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయకూడదు.అభ్యర్థుల వయస్సు దరఖాస్తు ముగింపు తేదీ నాటికి కనీసం 18 ఏళ్లు ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి జనరల్ కేటగిరీకి 25 ఏళ్లు కాగా, ఓబీసీలకు 3 ఏళ్లు (28 ఏళ్లు), ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు (30 ఏళ్లు) సడలింపు వర్తిస్తుంది.

అప్లికేషన్ ఇలా….

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe