...
...
Next Story

సిద్దిపేట : జాతీయ ఆరోగ్య మిషన్‌‌ పరిధిలో 110 పోస్టులు.. ఎలా అప్లై చేయాలి?

NHM Recruitment 2026 : జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఆరోగ్య కార్యక్రమాలు, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 110 కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. సెప్టెంబర్ 25వ తేదీలోపు అప్లై చేయాలి.

Published on: Sep 17, 2026, 18:53:23 IST
Advertisement

సిద్దిపేట జిల్లాలోని నిరుద్యోగులకు, పారామెడికల్, వైద్య కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు శుభవార్త. జాతీయ ఆరోగ్య మిషన్(NHM) కింద జిల్లా పరిధిలోని వివిధ ఆరోగ్య కేంద్రాలు, దవాఖానాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. జిల్లా కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో మొత్తం 110 ఖాళీలను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు.

సిద్దిపేటలో ఉద్యోగాలు
సిద్దిపేటలో ఉద్యోగాలు

సిద్దిపేట జిల్లాలోని పల్లె దవాఖానాలు, బస్తీ దవాఖానాలు, అసంక్రమిక వ్యాధుల నియంత్రణ కార్యక్రమం, పాలియేటివ్‌ కేర్‌, జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ (NUHM), ఆర్బీఎస్‌కే జిల్లా ఎర్లీ ఇంటర్వెన్షన్‌ సెంటర్‌, మొబైల్‌ హెల్త్‌ టీమ్స్‌, తెలంగాణ డయాగ్నోస్టిక్స్‌ హబ్‌ తదితర విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.

వివిధ ప్రోగ్రామ్‌ల కింద భర్తీ చేయనున్న ఖాళీలు, వాటికి చెల్లించే నెలవారీ వేతనాల వివరాలు ఇలా ఉన్నాయి. మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్ 37 పోస్టులు, స్టాఫ్ నర్స్ 39, ANM (మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్) 11, ఫార్మాసిస్ట్ 10, ల్యాబ్ టెక్నీషియన్ 4, ఫిజిషియన్ 2, డెంటల్ మెడికల్ ఆఫీసర్ 1, ఇతర స్పెషలిస్ట్ పోస్టులు ఫిజియోథెరపిస్ట్, ఆడియోలజిస్ట్/స్పీచ్ థెరపిస్ట్, ఎర్లీ ఇంటర్వెన్షనిస్ట్, ఆప్టోమెట్రిస్ట్, సైకాలజిస్ట్ ఒక్కొక్కటి చొప్పున ఖాళీలు ఉన్నాయి. మెుత్తం 110 ఖాళీలకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

అభ్యర్థుల వయస్సు 01-07-2026 నాటికి కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 44 సంవత్సరాలు మించకూడదు. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది. దివ్యాంగులకు 10 సంవత్సరాల మినహాయింపు ఉంటుంది.

15-09-2026 నుంచి దరఖాస్తుల స్వీకరిస్తున్నారు. సెప్టెంబర్ 25వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు దరఖాస్తు పూర్తి చేసి పంపాలి. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం సూచించింది.

ఈ లింక్ క్లిక్ చేసి అధికారిక వెబ్‌సైట్ వెళ్లి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks