...
...
Next Story

NIMS Admissions 2026 : నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు - నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు ఇవే!

NIMS BSc Nursing Admissions 2026 : హైదరాబాద్ నిమ్స్‌లో నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్ కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన మహిళా అభ్యర్థులు జూలై 11 లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Published on: Jun 30, 2026, 05:12:12 IST
Advertisement

NIMS BSc Nursing Admissions 2026 : వైద్య రంగంలో స్థిరపడాలనుకునే మహిళా విద్యార్థులకు హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అద్భుతమైన అవకాశం కల్పిస్తోంది. 2026 విద్యా సంవత్సరానికి గానూ నాలుగేళ్ల బీఎస్సీ (నర్సింగ్) డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం నిమ్స్ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ కోర్సు కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమేనని నిమ్స్ యాజమాన్యం స్పష్టం చేసింది. మొత్తం 100 సీట్లు అందుబాటులో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు:

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 11, 2026 సాయంత్రం 5:00 గంటల వరకు.
  • దరఖాస్తు హార్డ్ కాపీ సమర్పించడానికి చివరి తేదీ: జూలై 14, 2026 సాయంత్రం 5:00 గంటల లోపు.
  • తాత్కాలిక మెరిట్ జాబితా ప్రకటన: ఆగస్టు 27, 2026. తుది మెరిట్ జాబితా,
  • మొదటి విడత కౌన్సెలింగ్ అర్హుల జాబితా: సెప్టెంబర్ 02, 2026.
  • మొదటి విడత కౌన్సెలింగ్ తేదీ: సెప్టెంబర్ 12, 2026.
  • తరగతుల ప్రారంభం: అక్టోబర్ 05, 2026

నిమ్స్ లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు
నిమ్స్ లో బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్లు

ఇంటర్మీడియట్ (10+2) సైన్స్ గ్రూప్ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) చదివిన అభ్యర్థులు ఈ కోర్సు దరఖాస్తుకు అర్హులు. జనరల్ అభ్యర్థులు ఈ మూడు సబ్జెక్టుల్లో కలిపి కనీసం 45 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40% మార్కులు ఉంటే సరిపోతుంది. దీంతో పాటు ఇంటర్‌లో ఇంగ్లీష్ సబ్జెక్టులో విడిగా ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి.

తెలంగాణ ఓపెన్ స్కూల్ (TOSS), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (NIOS) ద్వారా సైన్స్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులైన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా అభ్యర్థులు తెలంగాణ స్టేట్ ఈఏపీసెట్ - 2026 (TS EAPCET-2026) లో ఖచ్చితంగా అర్హత సాధించి ఉండాలి. దీనిలో వచ్చిన ర్యాంకు ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంది. అభ్యర్థుల వయస్సు డిసెంబర్ 31, 2026 నాటికి కనీసం 17 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే 35 సంవత్సరాలు దాటకూడదు. దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. వివాహిత మహిళలు కూడా ఈ కోర్సులో చేరడానికి అర్హులే.

దరఖాస్తు విధానం….

కోర్సులో చేరిన విద్యార్థినులకు నిమ్స్ యాజమాన్యం ప్రతి నెలా స్టైపెండ్ చెల్లిస్తుంది. మొదటి ఏడాది నెలకు రూ. 5,000, రెండో ఏడాది రూ. 6,000, మూడో ఏడాది రూ. 7,000, నాలుగో ఏడాది నెలకు రూ. 8,000 చొప్పున స్టైపెండ్ లభిస్తుంది. అయితే ఇన్‌-సర్వీస్ అభ్యర్థులకు ఈ స్టైపెండ్ వర్తించదు. సంస్థ హాస్టల్ లేదా వసతి సౌకర్యం కల్పించదు, విద్యార్థులే సొంతంగా వసతి ఏర్పాటు చేసుకోవాలి.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe