NIT Warangal Faculty Recruitment 2026 : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) వరంగల్ నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ ఉద్యోగాలున్నాయి.
మొత్తం 34 ఖాళీలు….

ఎన్ఐటీ వరంగల్ ప్రకటన ప్రకారం మొత్తం 34 ఫ్యాకల్టీ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆ వివరాలు కింది విధంగా ఉన్నాయి….
• ప్రొఫెసర్ (Pay Level 14A ): 01 పోస్టు (అన్రిజర్వ్డ్)
• అసోసియేట్ ప్రొఫెసర్ (Pay Level 13A 2): 03 పోస్టులు (అన్రిజర్వ్డ్)
• అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-I (Pay Level 12 ): 06 పోస్టులు
• అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్-II (Pay Level 10) : 24 పోస్టులు
బయోటెక్నాలజీ, కెమికల్, సివిల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్స్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మ్యాథమెటిక్స్, మెకానికల్, మేనేజ్మెంట్ స్టడీస్, ఫిజిక్స్, ఎడ్యుకేషన్ తదితర విభాగాలు/శాఖలలో ఈ ఖాళీలు ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అత్యుత్తమ పరిశోధనా పత్రాలు, ప్రాజెక్టులు ఉన్న అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్టంగా 60 ఏళ్ల వరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం…
అభ్యర్థులు సమర్పించిన ఆన్లైన్ దరఖాస్తులు, రీసెర్చ్ క్రెడిట్ పాయింట్లు, నిబంధనల ఆధారంగా స్క్రూటినీ చేసి షార్ట్లిస్ట్ చేస్తారు. షార్ట్లిస్ట్ చేసిన అభ్యర్థులకు ప్రెజెంటేషన్/సెమినార్ మరియు పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక ప్రక్రియ చేపడతారు.
• జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు : రూ. 2000
{{/usCountry}}• జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు : రూ. 2000
{{/usCountry}}• ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అభ్యర్థులకు : రూ. 1000
• అభ్యర్థులు NIT వరంగల్ అధికారిక వెబ్సైట్ https://nitw.ac.in/Careers/ ద్వారా ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
• ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ : 30 నవంబరు 2026 (రాత్రి 11:59 గంటల వరకు)