...
...
Next Story

Gandhi Medical College Recruitment : గాంధీ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు - రాత పరీక్ష లేకుండానే..! ముఖ్య తేదీలివే

Gandhi Medical College Recruitment 2026 : సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్ లో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. నవంబర్ 26 దరఖాస్తుకు చివరి తేదీ.

Published on: Nov 23, 2026, 16:06:32 IST
Advertisement

Gandhi Medical College Recruitment 2026 : నిరుద్యోగులకు సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజ్ శుభవార్త అందించింది. కేంద్ర ఆరోగ్య పరిశోధన విభాగం (DHR), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ICMR) ఆధ్వర్యంలో కొనసాగుతున్న స్టేట్-లెవెల్ వైరల్ రీసెర్చ్ అండ్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీ (VRDL) లో వివిధ ఖాళీలను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు.

గాంధీ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్
గాంధీ మెడికల్ కాలేజీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్

రాత పరీక్ష లేకుండా కేవలం విద్యార్హతల మెరిట్, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ నియామకాలు చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు నవంబర్ 26, 2026 సాయంత్రం 5 గంటలలోపు నేరుగా దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు. 12 నెలల కాలపరిమితితో కూడిన ఈ పోస్టులను, అభ్యర్థుల పనితీరు ఆధారంగా పొడిగించే అవకాశం ఉంటుంది.

ఖాళీలు, అర్హతల వివరాలు…

  • రిసెర్చ్ సైంటిస్ట్-I (మెడికల్) - 1 పోస్టు
  • రిసెర్చ్ సైంటిస్ట్-I (నాన్-మెడికల్) - 1 పోస్టు
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్ / ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-III (PTS-III) - 2 పోస్టులు
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) - 1 పోస్టు
  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) - 1 పోస్టు

రిసెర్చ్ సైంటిస్ట్-I (మెడికల్) పోస్టుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎంబీబీఎస్, బీవీఎస్సీ లేదా బీడీఎస్ (BDS) ఉత్తీర్ణత సాధించాలి.

  • రిసెర్చ్ సైంటిస్ట్-I (నాన్-మెడికల్) పోస్టుకు మైక్రోబయాలజీ, వైరాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యులర్ బయాలజీ, బయోకెమిస్ట్రీ లేదా లైఫ్ సైన్సెస్ విభాగాల్లో పీజీ (M.Sc/M.Tech) తో పాటు మూడేళ్ల పరిశోధనా అనుభవం ఉండాలి. లేదా సెకండ్ క్లాస్ ఎమ్మెస్సీతో పాటు పీహెచ్‌డీ పూర్తి చేసి ఉండాలి.
  • ల్యాబొరేటరీ టెక్నీషియన్ (PTS-III) పోస్టుకు సంబంధిత విభాగంలో మూడేళ్ల డిగ్రీతో పాటు మూడేళ్ల అనుభవం ఉండాలి. లేదా సంబంధిత సబ్జెక్టులో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. బీఎస్సీ (MLT) శిక్షణ పొందిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.
  • డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్‌లో సర్టిఫికెట్ లేదా డిప్లొమా కలిగి ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, టైపింగ్‌లో మంచి నైపుణ్యం అవసరం.
  • మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ల్యాబ్ నిర్వహణలో అనుభవం ఉంటే మంచిది.

రాత పరీక్ష లేకుండానే…

ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి దరఖాస్తు ఫారమ్‌కు పదో తరగతి మెమో, డిగ్రీ/పీజీ మార్కుల జాబితాలు, అనుభవ ధ్రువీకరణ పత్రాలు, మూడు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను జత చేయాలి. వీటితో పాటు ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి "కాలేజ్ డెవలప్‌మెంట్ సొసైటీ, గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్ (College Development Society, Gandhi Medical College, Secunderabad)" పేరు మీద తీసిన నాన్-రిఫండబుల్ డిమాండ్ డ్రాఫ్ట్ జత చేయాలి.

సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తు ఫీజు రూ. 1,000, ఇతర పోస్టులకు రూ. 500 చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే వారు వేర్వేరుగా దరఖాస్తులు, డీడీలు సమర్పించాలి. దరఖాస్తు కవర్ పైన ఏ పోస్టుకు అప్లై చేస్తున్నారో పెద్ద అక్షరాలతో స్పష్టంగా రాయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను ప్రిన్సిపల్, గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్ కార్యాలయంలో స్వయంగా సమర్పించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 26, 2026 (సాయంత్రం 5:00 గంటల వరకు)

ఇంటర్వ్యూ తేదీ: డిసెంబర్ 1, 2026 (ఉదయం 11:00 గంటలకు)

ఇంటర్వ్యూ వేదిక: గాంధీ మెడికల్ కాలేజ్, సికింద్రాబాద్, హైదరాబాద్.

అధికారిక వెబ్ సైట్ - https://gmcsecunderabad.org/

 

ABOUT THE AUTHOR

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks