వినాయక చవితి ఉత్సవాల సందడి మెుదలైంది. దీంతో ఖైరతాబాద్, బాలాపూర్ గణపతి దర్శనం కోసం వెళ్లే భక్తుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TGSRTC) ప్రకటించింది. ఈ ప్రత్యేక సేవలు సెప్టెంబర్ 14 నుండి 24 వరకు అందుబాటులో ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ వై. నాగిరెడ్డి తెలిపారు.
ఈ బస్సులు నగరంలోని ప్రధాన బస్సు స్టేషన్లైన జూబ్లీ బస్సు స్టేషన్ (JBS), మహాత్మా గాంధీ బస్సు స్టేషన్ (MGBS) మీదుగా నడుస్తాయి. జేబీఎస్ నుండి బయలుదేరే బస్సులు ప్యాట్నీ, బాటా, బోట్ క్లబ్, ట్యాంక్ బండ్, ఐమాక్స్, ఖైరతాబాద్, లక్డికాపూల్, గాంధీ భవన్, అఫ్జల్‌గంజ్, సీబీఎస్, ఉమెన్స్ కాలేజ్, గవర్నమెంట్ ప్రెస్, ఐఎస్ సదన్, ఫిసల్‌బండ, బాలాపూర్ క్రాస్ రోడ్స్ మీదుగా బాలాపూర్ గణేష్ మండపం వైపు చేరుకుంటాయి.
జేబీఎస్ నుండి మొదటి ప్రత్యేక బస్సు ఉదయం 6 గంటలకు బయలుదేరుతుంది. రాత్రి 9:55 గంటల వరకు ప్రతి 40 నుండి 50 నిమిషాల వ్యవధిలో సేవలు కొనసాగుతాయి. బాలాపూర్ నుండి తిరుగు ప్రయాణ సేవలు ఉదయం 7:55 గంటలకు ప్రారంభమై రాత్రి 11:50 గంటల వరకు అందుబాటులో ఉంటాయి.
నగరంలో గణేష్ ఉత్సవాల సమయంలో భక్తులు ఎటువంటి అసౌకర్యం లేకుండా ప్రయాణించేలా ఆర్టీసీ ముందస్తు ఏర్పాట్లు చేసినట్టుగా ప్రకటించింది. పండుగ సమయంలో పెరగనున్న ప్రయాణికుల రద్దీని తట్టుకోవడం, రెండు ప్రధాన గణేష్ మండపాలకు రవాణా సౌకర్యం కల్పించడం ఈ ప్రత్యేక సేవల ముఖ్య ఉద్దేశం.
మరోవైపు పండుగ సీజన్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన తర్వాత బస్సులు తిరిగి వచ్చేటప్పుడు చాలా వరకు ఖాళీగా వస్తుంటాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివరించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, డీజిల్, నిర్వహణ కోసం అయ్యే అదనపు ఖర్చును భరించేందుకు సాధారణ ఛార్జీపై గరిష్టంగా 50 శాతం వరకు అదనపు ఛార్జీని వసూలు చేయనుంది. 'GO MS No 16 of 2003' రవాణా సంస్థలకు ప్రత్యేక సందర్భాల్లో అదనపు ఛార్జీలు అనుమతినిస్తుంది.
{{/usCountry}}మరోవైపు పండుగ సీజన్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చిన తర్వాత బస్సులు తిరిగి వచ్చేటప్పుడు చాలా వరకు ఖాళీగా వస్తుంటాయని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వివరించింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, డీజిల్, నిర్వహణ కోసం అయ్యే అదనపు ఖర్చును భరించేందుకు సాధారణ ఛార్జీపై గరిష్టంగా 50 శాతం వరకు అదనపు ఛార్జీని వసూలు చేయనుంది. 'GO MS No 16 of 2003' రవాణా సంస్థలకు ప్రత్యేక సందర్భాల్లో అదనపు ఛార్జీలు అనుమతినిస్తుంది.
{{/usCountry}}