...
...
Next Story

హైదరాబాద్‌లో ఆపరేషన్ కవచ్.. అర్ధరాత్రి 5 వేల మంది పోలీసుల తనిఖీలు!

హైదరాబాద్‌లో శాంతి భద్రతలను మరింత పటిష్టం చేసేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఆపరేషన్ కవచ్ పేరుతో ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.

Published on: Dec 6, 2025, 10:08:03 IST
Advertisement

ఆపరేషన్ కవచ్‌లో భాగంగా హైదరాబాద్ పోలీసులు శుక్రవారం రాత్రి నగరంలో పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా టాస్క్ ఫోర్స్, సిటీ ఆర్మ్డ్ రిజర్వ్, స్థానిక పోలీసుల నుండి 5000 మంది పోలీసులు పాల్గొన్నారు. నగరంలో అసాంఘిక కార్యకలాపాలు, అసాంఘిక శక్తుల కదలికలను నియంత్రించడమే ఈ ఆపరేషన్ లక్ష్యం అని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు.

ఆపరేషన్ కవచ్
ఆపరేషన్ కవచ్

'పౌరులలో భద్రత భావాన్ని పెంపొందించడానికి, ప్రోత్సహించడానికి జరుగుతున్న అతిపెద్ద ఆపరేషన్ ఇది. అసాంఘిక శక్తులలో భయాన్ని కలిగించడమే దీని లక్ష్యం.' అని సజ్జనార్ అన్నారు.

ఆపరేషన్‌ను పర్యవేక్షించడానికి పోలీసులు 10 డ్రోన్‌లను మోహరించారు. హైదరాబాద్ సీపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. తరువాత సజ్జనార్ టోలిచౌకి, చార్మినార్‌ ప్రాంతాన్ని పరిశీలించారు.

హైదరాబాద్ నగర పోలీసు కమిషనరేట్ అంతటా శాంతిభద్రతలను బలోపేతం చేయడానికి సమిష్టి ప్రయత్నంలో భాగంగా రాత్రి 10:30 గంటల నుండి ఆపరేషన్ కవచ్ అనే పేరుతో నాకాబందీ జరుగుతోందని సీపీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ చరిత్రలో మెుదటిసారిగా ఈ ఆపరేషన్‌లో 150 వ్యూహాత్మక ప్రదేశాలలో 5,000 మంది పోలీసు సిబ్బంది ఏకకాలంలో కఠినమైన తనిఖీలు నిర్వహించారు.

​ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ఆర్మ్డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు, అదనపు భద్రత, ట్రాఫిక్, టాస్క్ ఫోర్స్ విభాగాలు ఉన్నాయి. ​ప్రజా భద్రతను నిర్ధారించడానికి చేపట్టిన ఈ ప్రయత్నంలో పౌరుల సహకారాన్ని సీపీ సజ్జనార్ కోరారు. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను 100కు డయల్ చేయాలని చెప్పారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe