Job Mela 2026 : నిరుద్యోగులకు అలర్ట్ - ఓయూ క్యాంపస్ లో జాబ్ మేళా - కేవలం ఇంటర్వ్యూనే

Job Mela in Osmania University 2026 :హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో జులై 24న ఉచిత జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన అభ్యర్థులు ఇందుకు హాజరుకావచ్చు.

Published on: Jul 22, 2026, 09:20:59 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Job Mela in Osmania University 2026 : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఉస్మానియా యూనివర్సిటీ వేదిక జాబ్ మేళా జరగనుంది. యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో ఆధ్వర్యంలో జులై 24వ తేదీన ఈ జాబ్ మేళా నిర్వహించనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ఓ ప్రకటనలో కోరారు.

ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా
ఉస్మానియా యూనివర్సిటీలో జాబ్ మేళా

ఈ ప్రకటన ద్వారా 'అపోలో ఫార్మసీ' సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

మొత్తం 100 ఖాళీలు…

అపోలో ఫార్మసీ సంస్థలో మొత్తం 100 ఖాళీల భర్తీకి ఈ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.12,500 నుంచి రూ.25,000 వరకు వేతనం అందిస్తారు. ఎంపికైన వారు హైదరాబాద్‌ పరిధిలోనే విధులను నిర్వహించాల్సి ఉంటుంది.

  • ఫార్మసిస్ట్ : డి.ఫార్మసీ, బి.ఫార్మసీ (B.Pharm) లేదా ఎమ్.ఫార్మసీ ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఫార్మసీ అసిస్టెంట్ : ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
  • వయోపరిమితి : 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్న పురుషులు, మహిళలు ఇద్దరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా లేదా రెజ్యూమ్ తో పాటు, విద్యార్హతల సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలను తీసుకుని ఇంటర్వ్యూకు హాజరుకావాలి.

  • ఇంటర్వ్యూ తేదీ : జులై 24, 2026 (శుక్రవారం)
  • సమయం: ఉదయం 11:00 గంటలకు
  • వేదిక : ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా ఉన్న ‘యూనివర్సిటీ ఎంప్లాయ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో’, హైదరాబాద్.

ఈ జాబ్ మేళాకు సంబంధించిన మరింత సమాచారం లేదా సందేహాల నివృత్తి కోసం హెచ్.ఆర్ టి. రఘుపతిని 8247656356 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More