...
...
Next Story

Free Exam : ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్నారా? ఈ తేదీన ఓయూ ద్వారా ఫ్రీగా జనరల్ స్టడీస్ టెస్ట్

General Studies Test : సివిల్స్, గ్రూప్‌లాంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉస్మానియ విశ్వవిద్యాలయం ఒక అప్డేట్ ఇచ్చింది. ఉచితంగా జనరల్ స్టడీస్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. ఇందుకోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

Published on: Apr 7, 2026, 14:38:20 IST
Advertisement

సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉచితంగా జనరల్ స్టడీస్ టెస్ట్‌ను పెట్టనుంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సివిల్ సర్వీసెస్ అకాడమీ ఏప్రిల్ 12న ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు జనరల్ స్టడీస్‌పై ఉచిత పరీక్షను నిర్వహిస్తోంది.

ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా యూనివర్సిటీ

టెస్ట్ సిరీస్ బ్రోచర్‌ను వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. కుమార్ లాంఛనంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వైస్-ఛాన్సలర్ మాట్లాడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు విద్యాపరమైన ప్రతిభతో పాటు జాతీయ, రాష్ట్ర స్థాయి పోటీ పరీక్షలలో కూడా రాణించడానికి కృషి చేయాలని సూచించారు.

ఇలాంటి పరీక్షలు విద్యార్థులు తమ సన్నద్ధతను, పనితీరును మెరుగుపరుచుకోవడానికి గణనీయంగా సహాయపడతాయని వైస్ ఛాన్సలర్ పేర్కొన్నారు. అభ్యర్థులు తాము పోటీ పరీక్షల్లో ఎంతమేర ప్రిపేర్ అయ్యాం అనే విషయాన్ని అంచనా వేసుకోచ్చన్నారు. తద్వారా మరింతగా పరీక్షల కోసం మెరుగుపరుచుకోవడానికి ఒక విలువైన అవకాశాన్ని అందించడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అకాడమీ డైరెక్టర్ డాక్టర్ కొండా నాగేశ్వర్ తెలిపారు. ఈ ఉచిత పరీక్షను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులను కోరారు.

ఆసక్తిగల అభ్యర్థులు గూగుల్ ఫారం ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చని అకాడమీ డైరెక్టర్ కొండా నాగేశ్వర్ తెలిపారు. అఖండమైన స్పందన కారణంగా నమోదు పూర్తి చేసుకుని, సమయానికి హాజరైన అభ్యర్థులను మాత్రమే పరీక్ష రాయడానికి అనుమతిస్తారని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe