Telangana Voter List Revision 2026 : తెలంగాణలోఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ సాగుతోంది. జూన్ 15 నుంచి అక్టోబర్ 7 వరకు నమోదు చేసిన వినతులు, అభ్యంతరాల సమగ్ర నివేదికను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (CEO) గురువారం అధికారికంగా విడుదల చేశారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు ఫారమ్-7 కింద 24,323 దరఖాస్తులు రాగా…. క్షేత్రస్థాయి విచారణ అనంతరం అందులో 12,204 పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా పరిధిలోనే అత్యధికంగా 6,335 ఫారమ్-7 దరఖాస్తులు అందగా, అందులో 2,066 ఓట్లను అధికారులు తొలగించారు. ఇదే సమయంలో కొత్తగా ఓటరు నమోదు కోసం దాఖలైన ఫారమ్-6 దరఖాస్తులు రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 4,88,417 నమోదు కావడం విశేషం.
ఫారమ్-7 చుట్టూ వివాదం…!
ఓటర్ల జాబితాలో ప్రతిపాదిత పేర్ల చేర్పులపై అభ్యంతరం తెలపడానికి లేదా అనర్హుల పేర్ల తొలగింపు కోసం ఫారమ్-7 దరఖాస్తును ఉపయోగిస్తారు. అయితే ముషీరాబాద్, బహదూర్‌పురా, గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గాలలో ఈ ఫారమ్-7ను దుర్వినియోగం చేస్తున్నారంటూ తీవ్ర రాజకీయ రచ్చ మొదలైంది.
నిజమైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు బీజేపీ కార్యకర్తలు కుట్రపూరితంగా ఫారమ్-7 దరఖాస్తులు సమర్పిస్తున్నారని అధికార కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను బీజేపీ వర్గాలు పూర్తిగా తిరస్కరించాయి. ముషీరాబాద్ నియోజకవర్గంలో 151 ఫారమ్-7 దరఖాస్తులు రాగా 87 ఓట్లు, బహదూర్‌పురాలో 842 దరఖాస్తులు రాగా 87 ఓట్లు, గోషామహల్‌లో 222 దరఖాస్తులకు గాను 242 ఓట్లను అధికారులు తొలగించినట్లు నివేదిక స్పష్టం చేస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే అత్యధికంగా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో 1,509 ఫారమ్-7 దరఖాస్తులు రాగా…. అందులో విచారణ జరిపి 1,241 ఓట్లను తొలగించారు. దీని తర్వాత స్థానంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,026 దరఖాస్తులు రాగా, 161 ఓట్లను అధికారులు తొలగించారు.
{{/usCountry}}రాష్ట్రవ్యాప్తంగా పరిశీలిస్తే అత్యధికంగా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో 1,509 ఫారమ్-7 దరఖాస్తులు రాగా…. అందులో విచారణ జరిపి 1,241 ఓట్లను తొలగించారు. దీని తర్వాత స్థానంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 1,026 దరఖాస్తులు రాగా, 161 ఓట్లను అధికారులు తొలగించారు.
{{/usCountry}}ఈ రాజకీయ వివాదంపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు స్పందిస్తూ.. ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ అంతా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పర్యవేక్షణలోనే జరుగుతోందని స్పష్టం చేశారు. ఫారమ్-7 ద్వారా వచ్చే అభ్యంతరాలపై ఎన్నికల కమిషన్ క్షేత్రస్థాయిలో పూర్తి విచారణ జరిపిన తర్వాతే ఓట్ల తొలగింపుపై నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని ఆయన వివరించారు.