ప్రస్తుత 2026 ఖరీఫ్ సీజన్‌లో దేశవ్యాప్తంగా వరి సాగు గణనీయంగా తగ్గినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సెప్టెంబర్ 11 నాటికి అందిన అధికారిక డేటా ప్రకారం.. దేశంలో వరి సాగు విస్తీర్ణం 4 శాతం మేర తగ్గి 426.81 లక్షల హెక్టార్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే సమయానికి దేశంలో 443.78 లక్షల హెక్టార్లలో వరి పంట సాగవ్వడం గమనార్హం.

దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటకలో వర్షభావ పరిస్థితులు, వర్షపాత లేమి కారణంగా వరి సాగు విస్తీర్ణం భారీగా తగ్గినట్లు అధికారులు తెలిపారు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం, వివిధ రాష్ట్రాల్లో తగ్గిన వరి సాగు విస్తీర్ణం వివరాలు.
కర్ణాటకలో వరి సాగు విస్తీర్ణం 4.54 లక్షల హెక్టార్లు, తెలంగాణలో 4.46 లక్షల హెక్టార్లు, ఆంధ్రప్రదేశ్‌లో 1.90 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్‌లో 1.84 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్‌లో 1.75 లక్షల హెక్టార్లు, తమిళనాడులో 1.40 లక్షల హెక్టార్లు, మహారాష్ట్రలో 1.15 లక్షల హెక్టార్లు, జార్ఖండ్‌లో 0.97 లక్షల హెక్టార్ల మేర తగ్గింది. ఖరీఫ్ సీజన్‌లో అతిముఖ్యమైన ఈ వరి పంట కోతలు అక్టోబర్ నెల నుంచి ప్రారంభం కానున్నాయి.
వరి పంట విస్తీర్ణం తగ్గినప్పటికీ, పప్పుధాన్యాల సాగులో స్వల్ప పురోగతి కనిపించింది. గత ఏడాది 116.79 లక్షల హెక్టార్లుగా ఉన్న పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం ఈసారి 118.46 లక్షల హెక్టార్లకు పెరిగింది.
చిరుధాన్యాల సాగు విస్తీర్ణం 182.48 లక్షల హెక్టార్ల నుండి 183.17 లక్షల హెక్టార్లకు స్వల్పంగా పెరిగింది. నూనెగింజల పంటల విస్తీర్ణం గత ఏడాది 194.07 లక్షల హెక్టార్లుగా ఉండగా, ఈసారి 193.90 లక్షల హెక్టార్లకు తగ్గింది. పత్తి సాగు 110.31 లక్షల హెక్టార్ల నుండి 109.34 లక్షల హెక్టార్లకు పడిపోయింది. చెరకు సాగు విస్తీర్ణం కూడా 58.87 లక్షల హెక్టార్ల నుంచి 58.47 లక్షల హెక్టార్లకు స్వల్పంగా తగ్గింది.
దేశంలో వర్షపాతం లోపించడం వల్ల మొత్తం ఖరీఫ్ పంటల సాగు తగ్గింది. గత సంవత్సరం సెప్టెంబర్ 11 నాటికి మొత్తం ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,112.54 లక్షల హెక్టార్లుగా నమోదు కాగా.. ఈ 2026 సెప్టెంబర్ 11 నాటికి అది 1,096.49 లక్షల హెక్టార్లకు పరిమితమైంది.
{{/usCountry}}దేశంలో వర్షపాతం లోపించడం వల్ల మొత్తం ఖరీఫ్ పంటల సాగు తగ్గింది. గత సంవత్సరం సెప్టెంబర్ 11 నాటికి మొత్తం ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణం 1,112.54 లక్షల హెక్టార్లుగా నమోదు కాగా.. ఈ 2026 సెప్టెంబర్ 11 నాటికి అది 1,096.49 లక్షల హెక్టార్లకు పరిమితమైంది.
{{/usCountry}}