ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. రాజకీయ బిజీ షెడ్యూల్‌లోనూ ఓ అభిమాని చివరి కోరికను మన్నించి, అతని ఇంటికి వెళ్లి పరామర్శించి పెద్ద దిక్కుగా నిలిచారు.

తెలంగాణ రాష్ట్రం, హనుమకొండ పట్టణంలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్ అనే యువకుడు ‘డి.ఎన్.డి’ (DMD) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఎదుగుదల లేక, కనీసం మంచం పైనుంచి లేవలేని స్థితిలో ఉన్న నిరంజన్.. తన కోరికగా పవన్ కళ్యాణ్‌ను కలవాలని ఆశపడ్డాడు. తెలంగాణ జనసేన నాయకుల ద్వారా ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, బుధవారం స్వయంగా నిరంజన్ నివాసానికి చేరుకున్నారు.
మంచానికే పరిమితమైన నిరంజన్‌ను చూసి పవన్ కళ్యాణ్ తీవ్రంగా చలించిపోయారు. ఆ అభిమాని మంచం పైనే కూర్చుని, అతన్ని ఆత్మీయంగా హత్తుకున్నారు. నుదిటిపై ముద్దు పెట్టి ఆప్యాయంగా పలకరించారు. 'చిన్ననాటి నుంచి మీరంటే నాకు ఎంతో అభిమానం సార్.' అని నిరంజన్ నెమ్మదిగా చెబుతుంటే పవన్ మనసు కరిగిపోయింది. తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నుంచి తెప్పించిన పట్టువస్త్రాన్ని నిరంజన్‌కు కప్పి, అక్షతలు ఇచ్చి దీవించారు.
నిరంజన్ ఆరోగ్యం బాగున్న సమయంలో పవన్ కళ్యాణ్ పాటలకు చేసిన డ్యాన్స్ వీడియోలను, ఫోటోలను పవన్ ఆసక్తిగా తిలకించారు. తనను అంతా ప్రేమగా ‘చోటా గబ్బర్ సింగ్’ అని పిలుస్తారని నిరంజన్ చెప్పడంతో అక్కడ కాసేపు నవ్వులు విరిశాయి.
నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలతో మాట్లాడిన పవన్.. బాబు ఆరోగ్య పరిస్థితిని, అందిస్తున్న వైద్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని, భగవంతుడి ఆశీస్సులు బాబుకు ఉంటాయని భరోసా ఇచ్చారు. వైద్య ఖర్చుల నిమిత్తం తక్షణ సాయంగా రూ. 1,00,000 (లక్ష రూపాయలు) ఆర్థిక సాయాన్ని అందజేశారు.
పరామర్శ సమయంలో ఓ కుక్క పిల్ల బొమ్మను చూపించి, దానిని పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా.. తప్పకుండా కొని పంపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. అయితే ఇల్లు అద్దెది కావడం వల్ల ఓనర్లు ఒప్పుకోరని నిరంజన్ తండ్రి చెప్పడంతో.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ఇంటి యజమానులను పిలిపించి మాట్లాడి, బాబు కోరిక తీర్చాలని కోరారు.
{{/usCountry}}పరామర్శ సమయంలో ఓ కుక్క పిల్ల బొమ్మను చూపించి, దానిని పెంచుకోవాలని ఉందని నిరంజన్ కోరగా.. తప్పకుండా కొని పంపిస్తానని పవన్ హామీ ఇచ్చారు. అయితే ఇల్లు అద్దెది కావడం వల్ల ఓనర్లు ఒప్పుకోరని నిరంజన్ తండ్రి చెప్పడంతో.. పవన్ కళ్యాణ్ స్వయంగా ఆ ఇంటి యజమానులను పిలిపించి మాట్లాడి, బాబు కోరిక తీర్చాలని కోరారు.
{{/usCountry}}నిరంజన్ కుటుంబం గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటీన్‌లో పనిచేసేవారమని చెప్పడంతో, వారి శాశ్వత జీవనోపాధి మెరుగుపర్చేందుకు ఒక క్యాంటీన్ ఏర్పాటు చేయించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు.
నిరంజన్ పరామర్శ ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి బయలుదేరి వెళ్లారు. నిరంజన్ త్వరగా కోలుకోవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి వెండి ప్రతిమకు పూజ చేయించి ఆ కుటుంబానికి అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్‌తో పాటు జనసేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, పార్టీ నాయకులు రాధారం రాజలింగం, ఆర్.కె.సాగర్ తదితరులు పాల్గొన్నారు.