హైదరాబాద్‌లో ప్రతీ ఏటా పెరుగుతున్న వాహనాల సంఖ్య, దానికి తోడు ఐటీ కారిడార్‌లో నిత్యం నరకం చూపిస్తున్న ట్రాఫిక్ జామ్‌లకు శాశ్వత ముగింపు పలికేందుకు హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(HMDA) ఒక విప్లవాత్మక నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. భారీ నివాస సముదాయాల వద్ద ఏర్పడుతున్న రహదారి రద్దీని తగ్గించేందుకు భవన నిర్మాణ నిబంధనలలో కీలక మార్పులు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.

గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, నానక్‌రామ్‌గూడ వంటి ఐటీ కారిడార్ ప్రాంతాల్లో 500 అంతకంటే ఎక్కువ ఫ్లాట్లు ఉన్న బహుళ అంతస్తుల గేటెడ్ కమ్యూనిటీలు వందల సంఖ్యలో ఉన్నాయి. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఈ సొసైటీల లోపలికి బయటి వాహనాలను అనుమతించకపోవడంతో అసలు సమస్య మొదలవుతోంది.
ప్రయాణికులను ఎక్కించుకోవడానికి వచ్చే ఓలా, ఊబర్, ఐటీ కంపెనీల క్యాబ్‌లు, పాఠశాల బస్సులు ప్రధాన రహదారుల పక్కనే గంటల తరబడి నిలిపివేస్తున్నారు. పీక్ అవర్స్ ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రధాన రోడ్ల పక్కనే ఈ వాహనాలు ఆగడం వల్ల వందలాది మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి, తీవ్ర ట్రాఫిక్ స్తంభనకు కారణమవుతోంది.
ఈ సమస్యకు పరిష్కారంగా, భవిష్యత్తులో నిర్మించే ప్రతీ భారీ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో పికప్ అండ్ డ్రాప్ జోన్ కోసం ప్రాంగణం లోపలే ప్రత్యేక స్థలాన్ని కేటాయించడాన్ని ఎన్ఓసీ నిబంధనల్లో తప్పనిసరి చేయనున్నారు.
భవన నిర్మాణాలకు సంబంధించి ఇప్పటికే ఉన్న సెల్లార్ పార్కింగ్, సెట్‌బ్యాక్ నిబంధనలతో పాటుగా ఈ కొత్త నిబంధనను చేర్చనున్నారు. క్యాబ్‌లు, స్కూల్ బస్సులు ప్రధాన రహదారిపై ఆగకుండా, ప్రాంగణంలోకే వచ్చి ప్రయాణికులను దించి వెళ్లేలా ప్రవేశం, నిష్క్రమణ డిజైన్ ఉండాలి. హెచ్ఎండీఏ నగర ప్రణాళిక విభాగం అధికారులు త్వరలోనే దీనికి సంబంధించిన సమగ్ర విధివిధానాల ప్రకటన విడుదల చేయనున్నారు.
యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై చేపట్టిన విస్తృత అధ్యయనంలో పలు ఆసక్తికర ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. నగరంలో అత్యంత తీవ్రమైన రద్దీ నమోదవుతున్న 22 ప్రధాన జంక్షన్లను గుర్తించి, వాటి రీ-డిజైనింగ్ చేయాలని కమిటీ రికమండ్ చేసింది.
{{/usCountry}}యూనిఫైడ్ మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (UMTA) నగరంలోని ట్రాఫిక్ సమస్యలపై చేపట్టిన విస్తృత అధ్యయనంలో పలు ఆసక్తికర ప్రతిపాదనలు ముందుకు వచ్చాయి. నగరంలో అత్యంత తీవ్రమైన రద్దీ నమోదవుతున్న 22 ప్రధాన జంక్షన్లను గుర్తించి, వాటి రీ-డిజైనింగ్ చేయాలని కమిటీ రికమండ్ చేసింది.
{{/usCountry}}మెట్రో రైలు, టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు, ఎంఎంటీఎస్ రైలు రవాణా వ్యవస్థల మధ్య సజావుగా కనెక్టివిటీ ఉండేలా కొత్త వ్యూహం అమలు చేయనున్నారు. ఉదాహరణకు, అమీర్‌పేట వంటి బిజీ జంక్షన్‌లలో బస్టాప్‌ను మెట్రో స్టేషన్ మెట్ల కిందకు లేదా దానికి అత్యంత సమీపంలోకి మార్చడం ద్వారా ప్రయాణికులు త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవడానికి వీలవుతుంది.
హెచ్‌ఎండీఏ రూపకల్పన చేస్తున్న ఈ నూతన విధానాలు అమలులోకి వస్తే.. ఐటీ కారిడార్ సహా హైదరాబాద్‌లోని ప్రధాన నివాస ప్రాంతాల్లో రోడ్ల విస్తీర్ణం సద్వినియోగమై, రద్దీ సమయాల్లోనూ సురక్షితమైన, వేగవంతమైన ప్రయాణం సాధ్యమవుతుందని రవాణా రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.