ఘట్‌కేసర్ - ఎన్‌ఎఫ్‌సీ నగర్ (ఎన్‌ఎఫ్‌సీ నగర్) పరిధిలో ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాతిపదిన టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నియమించుకోనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా పీజీటీ (హిందీ, ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్) టీజీటీ (ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథ్స్, సోషల్ సైన్స్), పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, అకాడమిక్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్స్, బాలవాటిక టీచర్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, తెలుగు టీచర్ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.
ఈనెల 6న ఇంటర్వ్వూలు…
ఈ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థి విద్యా అర్హతలతో పాటు పని చేసిన అనుభవాన్ని పరగణనలోకి తీసుకుంటారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 6వ తేదీన ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎన్‌ఎఫ్‌సీ నగర్, ఘట్‌కేసర్, భువనగిరి వద్ద నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు వారి ధ్రువపత్రాలకు సంబంధించిన జిరాక్స్ సెట్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://ghatkesarnfc.kvs.ac.in/ లేదా https://bhongir.kvs.ac.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇదే వెబ్ సైట్ ల నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులు ఆయా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్ అర్హత తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ మీడియాల్లో బోధించగల సామర్థ్యం ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పోస్టును బట్టి జీతం ఉంటుంది.
{{/usCountry}}ఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులు ఆయా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్ అర్హత తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ మీడియాల్లో బోధించగల సామర్థ్యం ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పోస్టును బట్టి జీతం ఉంటుంది.
{{/usCountry}}