KVs Recruitment 2026 : ఘట్‌కేసర్ కేంద్రీయ విద్యాలయాలో ఉద్యోగాలు - కేవలం ఇంటర్వ్యూతోనే భర్తీ..!
ఘట్ కేసర్ - భువనగిరి పరిధిలోని పీఎం శ్రీ కేంద్రీయ కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ ప్రకటన జారీ అయింది. 2026-27 విద్యా సంవత్సరానికి గాను పార్ట్-టైమ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
ఘట్‌కేసర్ - ఎన్‌ఎఫ్‌సీ నగర్ (ఎన్‌ఎఫ్‌సీ నగర్) పరిధిలో ఉన్న పీఎం కేంద్రీయ విద్యాలయం నుంచి ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ ప్రాతిపదికన ప్రాతిపదిన టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను నియమించుకోనున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.

ఈ నోటిఫికేషన్ లో భాగంగా పీజీటీ (హిందీ, ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్) టీజీటీ (ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథ్స్, సోషల్ సైన్స్), పీఆర్‌టీ (ప్రైమరీ టీచర్), కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్, అకాడమిక్ కౌన్సెలర్, స్పెషల్ ఎడ్యుకేటర్, నర్స్, బాలవాటిక టీచర్, వొకేషనల్ ఇన్‌స్ట్రక్టర్, తెలుగు టీచర్ ఉద్యోగాలను రిక్రూట్ చేస్తారు.
ఈనెల 6న ఇంటర్వ్వూలు…
ఈ పోస్టుల భర్తీకి వాక్-ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. అభ్యర్థి విద్యా అర్హతలతో పాటు పని చేసిన అనుభవాన్ని పరగణనలోకి తీసుకుంటారు. అర్హత కలిగిన అభ్యర్థులు మార్చి 6వ తేదీన ఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, ఎన్‌ఎఫ్‌సీ నగర్, ఘట్‌కేసర్, భువనగిరి వద్ద నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకి హాజరయ్యే అభ్యర్థులు వారి ధ్రువపత్రాలకు సంబంధించిన జిరాక్స్ సెట్ ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలను https://ghatkesarnfc.kvs.ac.in/ లేదా https://bhongir.kvs.ac.in/ వెబ్ సైట్ లో చూడొచ్చు. ఇదే వెబ్ సైట్ ల నుంచి అప్లికేషన్ ఫారమ్ ను డౌన్లోడ్ చేసుకోవాలి.
ఈ పోస్టులకు హాజరయ్యే అభ్యర్థులు ఆయా విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. సీటెట్ అర్హత తప్పనిసరి. హిందీ, ఇంగ్లీష్ మీడియాల్లో బోధించగల సామర్థ్యం ఉండాలి. ఇందుకు సంబంధించిన పూర్తి అప్లికేషన్ ఫామ్ కూడా ఇదే వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. పోస్టును బట్టి జీతం ఉంటుంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

