రంగారెడ్డి జిల్లాలో ఘోరం - పోక్సో కేసులో జైలుకు పంపారనే కక్ష..! ఆరుగురిని నరికి చంపిన నిందితుడు!
రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడలో ఘోరం జరిగింది. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో జైలు నుంచి వచ్చిన ఓ ఉన్మాది…. కట్టుకున్న భార్య, ఇద్దరు పసిబిడ్డలతో పాటు మరో ముగ్గురిని అత్యంత కిరాతకంగా నరికి చంపాడు.
రంగారెడ్డి జిల్లాలో ఒళ్లు గగుర్పొడిచే అత్యంత కిరాతక ఘటన వెలుగుచూసింది. ఓ కేసులో ఉన్న వ్యక్తి ఉన్మాదానికి రెండు కుటుంబాలకు చెందిన ఆరుగురు అమాయకులు బలైపోయారు. గతంలో నమోదైన ఒక పోక్సో (POCSO) కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి.. సదరు కేసులోని బాధిత మైనర్ బాలికతో పాటు ఆమె కుటుంబ సభ్యులను, ఆపై తన సొంత భార్యాపిల్లలను అత్యంత దారుణంగా హత్య చేశాడు. షాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

కక్షతో దారుణం….
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాయవలగూడ గ్రామానికి చెందిన రాజు కుమార్ (35) అనే వ్యక్తిపై గతంలో పోక్సో చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసులో జైలుకు వెళ్లిన అతడు… ఇటీవలే బెయిల్‌పై బయటకు వచ్చాడు. నాటి నుంచి సదరు బాధిత కుటుంబంపై కక్ష పెంచుకున్న రాజు కుమార్…. శుక్రవారం రాత్రి షాబాద్‌లో నివసిస్తున్న బాలిక ఇంటిపై దాడికి తెగబడ్డాడు. ఇంట్లోకి చొరబడి మైనర్ బాలికను… కారులో తీసుకెళ్లాడు. బాలిక అమ్మమ్మ, నాయనమ్మ వారించినప్పటికీ బలవంతంగా 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న చెరువు వద్దకు బాలికను తీసుకెళ్లి అఘాయిత్యం చేసి గొంతు కోసి హత్య చేశాడు. తిరిగొచ్చి బాలిక అమ్మమ్మ, నాయనమ్మలను అతి కిరాతకంగా చంపేశాడు.
అక్కడితో నిందితుడి ఉన్మాదం చల్లారలేదు. ఈ దారుణం ముగిసిన వెంటనే తన ఇంటికి వెళ్లిన రాజు కుమార్.. అక్కడ తన భార్యను, ఇద్దరు అమాయక పిల్లలను కూడా దారుణంగా హతమార్చాడు. ఇలా రెండు కుటుంబాలను పూర్తిగా తుడిచిపెట్టిన తర్వాత అతడు తన తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. "రెండు కుటుంబాల కథ ముగించేశాను.. ఇక నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను," అని ఫోన్ లో చెప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. భయాందోళనకు గురైన నిందితుడి తల్లిదండ్రులు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. "పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న 35 ఏళ్ల రాజు కుమార్ అనే వ్యక్తి నిన్న రాత్రి మైనర్ బాలిక, ఆమె తల్లి, నానమ్మ సహా తన భార్య, ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేశాడు. నిందితుడి తల్లిదండ్రులు ఇచ్చిన సమాచారంతో మేం దర్యాప్తు ప్రారంభించాం. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించాం. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాం," అని పోలీస్ అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కిరాతక ఘటనపై షాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లోనూ దర్యాప్తును వేగవంతం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

