PM Modi Telangana Tour : ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. మే రెండో వారంలో ఆయన రాష్ట్రానికి రానున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారని సమాచారం.

సికింద్రాబాద్ పరేడ్ మైదానం ఈ భారీ బహిరంగ సభకు వేదిక కానుంది. ఈ వేదిక నుంచే ప్రధాని తన ప్రసంగం ద్వారా అటు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు….. ఇటు తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని వివరించనున్నారు. ఈ సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నేతలు, భారీ ఎత్తున జన సమీకరణ చేసేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన….
పరేడ్ గ్రౌండ్స్ సభ నుంచే ప్రధాని మోదీ వర్చువల్ పద్ధతిలో రాష్ట్రంలోని పలు కీలక ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణ పనులను ప్రధాని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇది ఈ ప్రాంతంలో పారిశ్రామిక వృద్ధికి, ఉపాధి కల్పనకు పెద్దపీట వేయనుంది.
గిరిజన విద్యార్థులకు ఉన్నత చదువులను చేరువ చేసే లక్ష్యంతో ములుగులో నిర్మిస్తున్న కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయానికి ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. రాష్ట్రంలోని ఏకైక ఎయిమ్స్ బీబీనగర్‌లో కొత్తగా నిర్మించిన హాస్టల్ భవనాలను ప్రధాని ప్రారంభించనున్నారు. దీనివల్ల వైద్య విద్యార్థులకు వసతి సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. మెగా టెక్స్‌టైల్ పార్కులో పూర్తయిన కీలక విభాగాలను ప్రధాని ప్రారంభించనున్నారు. అంతేకాకుండా ఖమ్మం - దేవరపల్లి మధ్య నిర్మించిన అత్యాధునిక గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిని ప్రధాని ప్రారంభించనున్నారు. ఈ రహదారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య రవాణా వ్యవస్థను వేగవంతం చేయనుంది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ పర్యటనలో భాగంగానే... మామునూరు విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేస్తారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక తెలంగాణకు తొలిసారిగా మోదీ రానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే ఈ పర్యటనలో భాగంగానే... మామునూరు విమానాశ్రయానికి కూడా శంకుస్థాపన చేస్తారని సమాచారం. అయితే దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.
{{/usCountry}}