చెత్త సేకరణకు జీహెచ్ఎంసీ కొత్త రూల్ తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. రాజేంద్రనగర్ జోన్ అత్తాపూర్ సర్కిల్ పరిధిలోని హైదర్‌గూడలోని నలంద నగర్‌లో క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటింటికీ చెత్త సేకరణ సామర్థ్యాన్ని పరీక్షించడానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఒక పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది.

ఈ సిస్టమ్ ప్రకారం, స్వచ్ఛ ఆటో డ్రైవర్లు/యజమానులు ప్రతిరోజూ చెత్త సేకరణను స్కాన్ చేసి నమోదు చేసుకోవడానికి ప్రతి వ్యక్తిగత ఇల్లు/అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌కు క్యూఆర్ కోడ్ ఇస్తారు. ఈ విధంగా ప్రతి వార్డులోని ఎన్ని కుటుంబాలు వాహనాలకు చెత్తను అందిస్తున్నాయో తెలుసుకోవడం సాధ్యమవుతుందని అధికారులు తెలిపారు.
క్యూఆర్ కోడ్ ఆధారిత ఇంటింటికీ వ్యర్థాల సేకరణ వ్యవస్థ జవాబుదారీతనాన్ని పెంచుతుందని, ప్రతి ఇంటి నుండి రోజువారీ చెత్త సేకరణ జరుగుతున్నట్టుగా క్లారిటీ వస్తుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.
గ్రేటర్ హైదరాబాద్‌ను పరిశుభ్రమైన నగరంగా మార్చడంలో స్వచ్ఛ ఆటో కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారని కమిషనర్ చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రతిరోజూ ఇంటింటికీ చెత్త సేకరణ తప్పకుండా జరిగేలా చూడాలని డిప్యూటీ కమిషనర్లతోపాటుగా కిందిస్థాయి అధికారులను ఆదేశించారు.
స్వచ్ఛ ఆటో కార్మికులకు చెత్తను అప్పగించని కుటుంబాలను గుర్తించాలని ఆర్వీ కర్ణన్ అన్నారు. వారిని ప్రతీ రోజు చెత్తను అందించేలా అవగాహన కల్పించాలన్నారు. దీనిద్వారా అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని, క్లీన్ సిటీగా హైదరాబాద్ ఉంటుందని అధికారులకు వివరించారు. పారిశుధ్య కార్మికుల పనితీరు, హాజరులో నిర్లక్ష్యం, పర్యవేక్షణ లోపాలను సహించబోమని కర్ణన్ హెచ్చరించారు.
పారిశుధ్య సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్.. అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పరిశుభ్రత కార్యక్రమాలలో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అవగాహన, ఔట్రీచ్ కార్యక్రమాలకు కమిషనర్ పిలుపునిచ్చారు.
{{/usCountry}}పారిశుధ్య సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులపై వెంటనే స్పందించాలని కూడా జీహెచ్ఎంసీ కమిషనర్.. అధికారులను ఆదేశించారు. ప్రజల భాగస్వామ్యం ప్రాముఖ్యతను ఈ సందర్భంగా నొక్కి చెప్పారు. పరిశుభ్రత కార్యక్రమాలలో సమాజ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి అవగాహన, ఔట్రీచ్ కార్యక్రమాలకు కమిషనర్ పిలుపునిచ్చారు.
{{/usCountry}}పైలట్ ప్రాజెక్ట్ సానుకూల ఫలితాలను ఇస్తే జీహెచ్ఎంసీ పరిమితుల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత వ్యర్థాల సేకరణ వ్యవస్థను అమలు చేయడానికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు అధికారులు తెలిపారు. అత్తాపూర్ సర్కిల్‌తోపాటుగా వనస్థలిపురం, కైత్లాపూర్ పరిధిలో క్యూఆర్ కోడ్ డోర్ టూ డోర్ చెత్త సేకరణ పైలట్ ప్రాజెక్టు నడుస్తోంది. కోడ్ స్కాన్ చేసేందుకు మీ ఇంటి గోడకు క్యూఆర్ అతికించే అవకాశం ఉంది. దీంతో మీ ఇంటి గుమ్మం వద్దకు కొత్త రూల్ వస్తుంది.