Telangana Weather Report : భానుడి భగభగల వేళ తెలంగాణకు వర్ష సూచన - ఐఎండీ హెచ్చరికలు

Telangana Weather Report : తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. మరోవైపు పలు జిల్లాలకు వాతావరణశాఖశాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది.

Published on: May 21, 2026, 17:38:04 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Telangana Weather Report : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వాతావరణంలో పెను మార్పులు సంభవిస్తున్నాయి. మధ్య బంగాళాఖాతం, నైరుతి బంగాళాఖాతం మీదుగా తమిళనాడు వరకు సగటు సముద్రమట్టం నుండి 3.1 కిలోమీటర్ల నుండి 4.5 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఓవైపుఎండలు...! పలు జిల్లాకు వర్షసూచన (image istock)
ఓవైపుఎండలు...! పలు జిల్లాకు వర్షసూచన (image istock)

ఇదే సమయంలో రాష్ట్రంలోని పలు జిల్లాలను వడగాల్పులు ముంచెత్తనున్నాయి. ఒకేసారి వడగాల్పులు, వర్షాల హెచ్చరికలు జారీ కావడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం..ఇవాళ్టి నుంచి రేపు ఉదయం 8.30 గంటల వరకు రాష్ట్రంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. అంతేకాకుండా కొత్తగూడెం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వడగాల్పులు వీచే సూచనలున్నాయి.

రేపు(మే 22) ఉదయం 8.30 గంటల తర్వాత నుంచి కూడా పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు పడొచ్చు. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.

మే 23వ తేదీ నుంచి పూర్తిగా పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఎలాంటి వర్ష సూచన ఉండదు. పలు జిల్లాల్లో వడగాల్పుల పరిస్థితులుంటాయి. ఎండల తీవ్రత రోజురోజుకూ మరింత పెరుగుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో బయటికి రావొద్దని హెచ్చరిస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More