తీర్థ యాత్రలకు వెళ్ళే వారికోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం మార్చి 21వ తేదీ నుండి మే 21వ తేదీలలో 4 ప్రత్యేక ప్యాకేజీలను 'భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు' ద్వారా హైదరాబాద్ నుండి అందిస్తున్నట్టుగా ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పి.వి.వెంకటేష్ తెలిపారు. కరీంనగర్ రైల్వేస్టేషన్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు.
దివ్యదక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లింగ

తిరువణ్ణామలై, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరుకు ఈ యాత్రలో వెళ్లవచ్చు. మార్చి 21వ తేదీన ప్రారంభమై 28వ తేదీ వరకు ఉంట్టుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.14,700, 3ఏసీ ధర రూ.22,300, 2ఏసీ ధర రూ.28,700 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట మీదుగా వెళ్తుంది.
సప్త జ్యోతిర్లింగ దర్శన్ యాత్ర
ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్) ద్వారక (నాగేశ్వర్), సోమనాథ్ (సోమ్నాథ్), పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) ఈ టూర్‌లో కవర్ చేయవచ్చు. ఈ యాత్ర ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమై 24వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.17,600, 3ఏసీ ధర రూ.26,700, 2ఏసీ ధర రూ.34,600 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, ధర్మాబాద్, ముద్ఖేడ్, నాందేడ్, పూర్ణ మీదుగావెళ్తుంది.
అయోధ్య-కాశీ యాత్ర
అయోధ్య-కాశీ యాత్ర బైద్యనాథ్ ధామ్ దర్శన్ యాత్ర.. పూరి - కోణార్క్ - బైద్యనాథ్ ధామ్ - వారణాసి - అయోధ్య – ప్రయాగ్‌రాజ్ మీదుగా వెళ్తుంది. ఈ యాత్ర ఏప్రిల్ 28వ తేదీన ప్రారంభమై మే 5వ తేదీ వరకు ఉంటుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16,700, 3ఏసీ ధర రూ.26,100, 2ఏసీ ధర రూ.34,100 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, కాజీపేట, వరంగల్, ఖమ్మం, విజయవాడ, గుడివాడ, భీమవరం, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట, తుని, దువ్వాడ, పెందుర్తి, విజయనగరం మీదుగావెళ్తుంది.
హరిద్వార్-మాతావైష్ణోదేవి-రిషికేష్-యాత్ర
ఐఆర్‌సీటీసీ మధుర-బృందావనం-మాతా వైష్ణోదేవి-హరిద్వార్-రిషికేశ్ యాత్ర కూడా అందిస్తోంది. ఈ యాత్ర మే 12వ తేదీన ప్రారంభమై మే 21 వ తేదీ వరకు ఉండనుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16,500, 3ఏసీ ధర రూ.25,700, 2ఏసీ ధర రూ.33,400 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, పెద్దపల్లి , మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, నాగ్‌పూర్ మీదుగావెళ్తుంది
సౌకర్యాలు
{{/usCountry}}ఐఆర్‌సీటీసీ మధుర-బృందావనం-మాతా వైష్ణోదేవి-హరిద్వార్-రిషికేశ్ యాత్ర కూడా అందిస్తోంది. ఈ యాత్ర మే 12వ తేదీన ప్రారంభమై మే 21 వ తేదీ వరకు ఉండనుంది. దీనికి ఒక్కొకరికి సాధారణ టికెట్టు ధర రూ.16,500, 3ఏసీ ధర రూ.25,700, 2ఏసీ ధర రూ.33,400 ఉంటుంది. ఈ యాత్ర సికింద్రాబాద్, జనగాం, కాజీపేట, పెద్దపల్లి , మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్ నగర్, బల్హర్షా, నాగ్‌పూర్ మీదుగావెళ్తుంది
సౌకర్యాలు
{{/usCountry}}రైలు, బస్సు, హోటల్, భోజనాలు (ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం), వాటర్ బాటిల్, టూర్ ఎస్కాట్ సేవలతో సందర్శనా స్థలాలు, ప్రయాణ బీమా అలాగే రైల్వే స్టేషన్ నుండి దేవాలయాలకు ప్రయాణం పూర్తిగా ఉచితంగా ఉంటుంది. ప్రతి రైలులో 705 మంది ప్రయాణికులు ఉంటారని, ప్రతి 70 మందికి ఇద్దరు కోర్డినెటర్లు అందుబాటులో ఉండి అన్ని సౌకార్యాలు సమకురుస్తారని ఐఆర్‌సీటీసీ టూరిజం అసిస్టెంట్ మేనేజర్ పీవీ వెంకటేశ్ చెప్పారు.
కోచ్‌కి ఒక సెక్యూరిటీ గార్డ్ అలాగే రైలులో సీసీ కెమెరాలతో కూడిన భద్రత ఉంటుందని తెలియజేశారు పీవీ వెంకటేశ్. టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు వివరాలకు 9701360701, 9281030727, 9281030759లకు సంప్రదించాలి. మరిన్ని వివరణలకు www.irctctourism.com వెబ్‌సైట్‌కు వెళ్లవచ్చు.