...
...
Next Story

ఆధ్యాత్మిక యాత్రల్లో జెన్ జీ బిజిబిజీ.. రెడ్‌బస్ తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు

తెలుగు రాష్ట్రాల్లో తిరుపతి ఆధ్యాత్మిక యాత్రలకు డిమాండ్ భారీగా పెరిగింది. రెడ్‌బస్ తాజా నివేదిక ప్రకారం, ఈ ప్రయాణాల్లో 18-30 ఏళ్ల లోపు వయసున్న జెన్-జీ యువత ఏకంగా 47 శాతం వాటాతో ముందంజలో ఉన్నారు.

Published on: Jun 26, 2026, 09:17:32 IST
Advertisement

తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌సిటీ ప్రయాణాలకు, ప్రధానంగా ఆధ్యాత్మిక యాత్రలకు ఆదరణ అమాంతం పెరిగింది. వారాంతపు సెలవులతో పాటు తిరుమలలో జరిగే ప్రతిష్టాత్మక ‘జ్యేష్ఠాభిషేకం’ ఉత్సవాల నేపథ్యంలో తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య భారీగా పెరిగినట్లు ప్రపంచంలోనే అతిపెద్ద ఆన్‌లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘రెడ్‌బస్’ (redBus) వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి బస్ బుకింగ్స్ గతేడాదితో పోలిస్తే జూన్ 14 నుంచి జూన్ 20 మధ్య కాలంలో 22 శాతం వృద్ధిని నమోదు చేయనున్నట్లు సంస్థ అంచనా వేసింది.

ఆధ్యాత్మిక యాత్రల్లో జెన్ జీ బిజిబిజీ.. రెడ్‌బస్ తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు
ఆధ్యాత్మిక యాత్రల్లో జెన్ జీ బిజిబిజీ.. రెడ్‌బస్ తాజా నివేదికలో ఆసక్తికర అంశాలు

కలియుగ వైకుంఠంగా భావించే శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రానికి దేశవ్యాప్తంగా భక్తులు పోటెత్తుతున్నారు. ఇందుకు నిదర్శనంగా 2026 జనవరి నుంచి మే నెలల మధ్య కాలంలోనే తిరుమలలో ఏకంగా 4.4 కోట్లకు పైగా భోజనాలు, పానీయాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆధ్యాత్మిక యాత్రలతో పాటు వీకెండ్ ప్లాన్స్, సీజనల్ ప్రయాణాలు కూడా ఈ రద్దీకి కారణమవుతున్నాయి. కుటుంబాలు, విద్యార్థులు, యువత తక్కువ వ్యవధి ప్రయాణాలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రెడ్‌బస్ ప్లాట్‌ఫామ్‌లో నమోదైన బుకింగ్స్ ఆధారంగా కొన్ని కీలక ప్రయాణ ట్రెండ్స్ ఇలా ఉన్నాయి.

ప్రయాణికుల తొలి ఛాయిస్ ఇవే..

తెలుగు రాష్ట్రాల పరిధిలో (Intra-region) హైదరాబాద్-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం, విజయవాడ-తిరుపతి, విశాఖపట్నం-హైదరాబాద్, హైదరాబాద్-నెల్లూరు రూట్లలో అత్యధిక రద్దీ కనిపిస్తోంది. ఇక పొరుగు రాష్ట్రాల సర్వీసుల్లో (Inter-region) హైదరాబాద్-బెంగళూరు, తిరుపతి-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-పుణె, నెల్లూరు-బెంగళూరు రూట్లు టాప్‌లో నిలిచాయి. హైదరాబాద్‌లోని ప్రధాన బోర్డింగ్ పాయింట్లలో ఎంజీబీఎస్ (MGBS), కూకట్‌పల్లి, గచ్చిబౌలి, మియాపూర్, లక్డీకాపూల్, అమీర్‌పేట్ ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా బస్సులు ఎక్కుతున్నారు.

లగ్జరీ ప్రయాణానికే మొగ్గు

వేసవి కాలం, ప్రయాణ సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని 65 శాతం మంది ప్రయాణికులు ఏసీ (AC) బస్సులనే ఎంచుకుంటున్నారు. రాత్రి వేళల్లో, సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు వీలుగా 58 శాతం మంది స్లీపర్ బస్సులను, 42 శాతం మంది సీటర్ సర్వీసులను బుక్ చేసుకుంటున్నట్లు రెడ్‌బస్ గణాంకాలు చెబుతున్నాయి.

ప్రయాణాల్లో జెన్-జీ హవా.. మహిళల జోరు

ఇక ప్రయాణం ప్రారంభించే నగరాల విషయానికి వస్తే.. 42 శాతం మంది టైర్-1 నగరాల నుంచి, 21 శాతం మంది టైర్-2 పట్టణాల నుంచి, 37 శాతం మంది టైర్-3 చిన్న పట్టణాలు, గ్రామాల నుంచి తమ ప్రయాణాలను సాగిస్తున్నారు.

పెరుగుతున్న ఆధ్యాత్మిక డిమాండ్‌కు అనుగుణంగా రెడ్‌బస్ తన సేవలను మరింత సులభతరం చేస్తోంది. భక్తులు తమ యాత్రలను సురక్షితంగా, నమ్మకంగా ప్లాన్ చేసుకునేలా రవాణా సదుపాయాలను మెరుగుపరుస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికులకు ఒక ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి తిరుపతికి రెడ్‌బస్ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకునే వారికి గరిష్టంగా రూ.500 వరకు తగ్గింపు లభిస్తుంది. 2026 మే 01 నుంచి జూన్ 30 వరకు చేసే ప్రయాణ బుకింగ్స్‌కు 'PILGRIM' అనే కోడ్‌ను ఉపయోగించి ఈ ఆఫర్‌ను పొందవచ్చు.

 
ABOUT THE AUTHOR
Praveen Kumar Lenkala

ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks