రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి వెంటనే తప్పించాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. నిర్ణీత గడువులోగా క్షమాపణతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయనందున, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే మార్చాలని తెలంగాణ హైకోర్టు సీఎస్‌ను ఆదేశించింది. లోతుకుంటకు సంబంధించిన భూ వివాదం కేసు విచారణ సందర్భంగా ఈ ఆదేశం వెలువడింది.

లోతుకుంటలోని భూ వివాదానికి సంబంధించిన పిటిషన్‌ను విచారిస్తున్న సందర్భంగా హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను తక్షణమే మార్చాలని హైకోర్టు సీఎస్‌ని ఆదేశించింది. గతంలో సోమవారం లోగా లిఖితపూర్వక అఫిడవిట్ ద్వారా క్షమాపణ చెప్పాలని తెలంగాణ హైకోర్టు రంగనాథ్‌ను ఆదేశించింది. అయితే హైడ్రా తరఫు న్యాయవాది, క్షమాపణకు బదులుగా త్వరలో ఒక పిటిషన్ దాఖలు చేయనున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అడ్వకేట్ జనరల్ జోక్యం తర్వాత, అఫిడవిట్ దాఖలు చేయడం కోసమే ప్రత్యేకంగా సోమవారం వరకు సమయం ఇచ్చారని గుర్తుచేస్తూ, ఈ వాదనను కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఏవీ రంగనాథ్‌ను హైడ్రా చీఫ్ పదవి నుంచి తొలగించి, ఆయన స్థానంలో తగిన వ్యక్తిని నియమించాలని తెలంగాణ హైకోర్టు సీఎస్‌ను ఆదేశించింది. ఆయనపై ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయని పేర్కొంది. ఈ విషయాన్ని న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది.
లోతుకుంటలోని 40 ఎకరాల భూమికి సంబంధించి శాంత శ్రీరామ్ కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన ధిక్కార పిటిషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు. కోర్టు ఆదేశాలు ఉన్నా.. హైడ్రా అధికారులు తమ భూముల్లోకి వచ్చి జోక్యం చేసుకుంటున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక అధికారిపై 63 కోర్టు ధిక్కరణ కేసులు ఉండటం ఏంటని అడిగింది.
గతంలో విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు చెబుతూ, హైడ్రా మళ్లీ ఆ ఆస్తిలోకి ప్రవేశించదని హామీ ఇస్తూ, సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలని రంగనాథ్‌ను ఆదేశించింది కోర్టు. జూలై 18న ఆస్తిలోకి ప్రవేశించడానికి గల కారణాలను కూడా రంగనాథ్ వివరించాలని తెలిపింది.
{{/usCountry}}గతంలో విచారణ సందర్భంగా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించినందుకు క్షమాపణలు చెబుతూ, హైడ్రా మళ్లీ ఆ ఆస్తిలోకి ప్రవేశించదని హామీ ఇస్తూ, సవివరమైన అఫిడవిట్ దాఖలు చేయాలని రంగనాథ్‌ను ఆదేశించింది కోర్టు. జూలై 18న ఆస్తిలోకి ప్రవేశించడానికి గల కారణాలను కూడా రంగనాథ్ వివరించాలని తెలిపింది.
{{/usCountry}}కోర్టు ఆదేశాల మేరకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు. న్యాయస్థానానికి క్షమాపణలు తెలిపారు. తనకు కోర్టులు అంటే ఎంతో గౌరవం, నమ్మకం ఉన్నాయని పేర్కొన్నారు. లోతుకుంటలోని 40 ఎకరాల స్థలంలోకి హైడ్రా సిబ్బంది అసలు వెళ్లలేదని, పిటిషనర్ కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని రంగనాథ్ తన అఫిడవిట్‌లో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనల తీరుపై హైకోర్టు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేసింది. హైడ్రా కమిషనర్ పోస్టు నుంచి రంగనాథ్‌ను తొలగించాలని ఆదేశించింది.