రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన సమాచారం అందించింది. మిర్యాలగూడ నుంచి కాచిగూడ వైపు ప్రయాణించే ప్యాసింజర్ రైలు సమయాల్లో మార్పులు జరిగాయి. మిర్యాలగూడ–కాచిగూడ (రైలు నంబర్ 67776)ప్యాసింజర్ కొత్త వేళలు జూలై 10, 2026 నుండి ప్రారంభమయ్యే ప్రయాణాలకు వర్తిస్తాయని అధికారులు వెల్లడించారు.

నిర్వహణ పరమైన కారణాల వల్ల కొన్ని రైళ్లను మల్కాజ్‌గిరి రూట్‌కు బదులుగా చర్లపల్లి - మౌలా అలీ - లల్లాగూడ - సీతాఫల్‌మండి మీదుగా మళ్లించడమే ఈ సమయాల మార్పునకు ప్రధాన కారణం. మిర్యాలగూడ - నాగిరెడ్డిపల్లి మధ్య ఉన్న మిగిలిన స్టేషన్లలో రైలు సమయాల్లో ఎలాంటి మార్పు ఉండదు.
పాత, కొత్త సమయాల పూర్తి వివరాలు:
- మిర్యాలగూడ : ఈ స్టేషన్ నుండి రైలు బయలుదేరే పాత సమయం, కొత్త సమయం ఒకటే. ఉదయం 05:35 గంటలకు రైలు ఇక్కడి నుండి కదులుతుంది.
- బీబీనగర్ : పాత సమయం ఉదయం 07:59/08:00 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 07:54కు చేరుకుని 07:55కు బయలుదేరుతుంది.
- ఘట్‌కేసర్ : పాత సమయం ఉదయం 08:09/08:10 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 08:05కు చేరుకుని 08:06కు బయలుదేరుతుంది.
- చర్లపల్లి : పాత సమయం ఉదయం 08:19/08:20 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 08:15కు చేరుకుని 08:16కు బయలుదేరుతుంది.
- మల్కాజ్‌గిరి : పాత సమయం ఉదయం 09:44/09:45 కాగా….. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:39కు చేరుకుని 08:40కు బయలుదేరుతుంది.
- సీతాఫల్‌మండి : పాత సమయం ఉదయం 09:54/09:55 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:54కు చేరుకుని 08:55కు బయలుదేరుతుంది.
- ఆర్ట్స్ కాలేజ్ : పాత సమయం ఉదయం 09:56/09:57 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 08:57కు చేరుకుని 08:58కు బయలుదేరుతుంది.
- జామై ఉస్మానియా : పాత సమయం ఉదయం 09:58/09:59 కాగా…. కొత్త సమయం ప్రకారం ఉదయం 09:00కు చేరుకుని 09:01కు బయలుదేరుతుంది.
- విద్యానగర్ : పాత సమయం ఉదయం 10:00/10:01 కాగా, కొత్త సమయం ప్రకారం ఉదయం 09:04కు చేరుకుని 09:05కు బయలుదేరుతుంది.
- కాచిగూడ : ఈ రైలు చివరి స్టేషన్ అయిన కాచిగూడకు పాత సమయం ప్రకారమే ఉదయం 10:20 గంటలకు చేరుకుంటుంది. ఇందులో ఎలాంటి మార్పు లేదు.
మల్కాజ్‌గిరి నుంచి విద్యానగర్ మధ్య ఉన్న స్టేషన్లలో రైలు నిమిషాల వ్యవధి ముందే రానుంది. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త సమయ పట్టికను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}మల్కాజ్‌గిరి నుంచి విద్యానగర్ మధ్య ఉన్న స్టేషన్లలో రైలు నిమిషాల వ్యవధి ముందే రానుంది. కాబట్టి ప్రయాణికులు ఈ కొత్త సమయ పట్టికను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
{{/usCountry}}