తెలంగాణలో పారదర్శకమైన భూ యాజమాన్య రికార్డులు, వివాదరహిత భూ పరిపాలన అందించడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా భూభారతిని తెచ్చిందని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఉమ్మడి మెదక్ జిల్లా అధికారుల సమీక్షా సమావేశం అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

పౌరులకు ఆధార్ కార్డు ఉన్నట్లే, ప్రతి భూ యజమానికి, వారి భూమికి భూదార్ పేరిట ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా శాటిలైట్ చిత్రాలతో కూడిన కచ్చితమైన భూ పటాలను కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలలో పొందుపరచనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
గతంలో అమలు చేసిన ధరణి పోర్టల్ వల్ల అనేక సమస్యలు తలెత్తాయని, వాటిని అధిగమించేందుకు విప్లవాత్మక మార్పులతో భూభారతిని రూపొందించామని మంత్రి పొంగులేటి చెప్పారు. దాదాపు 125 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో మళ్లీ సమగ్ర భూ సర్వే చేపడుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
ఇప్పటికే 380 గ్రామాల్లో భూ సర్వే పూర్తి చేసి పట్టాదారులకు హక్కు పత్రాలు అందజేశామని, మరో 900 గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరిందని తెలిపారు. తొలి విడతగా ప్రతి జిల్లాలో 70 రెవెన్యూ గ్రామాలను ఎంపిక చేసి సర్వే వేగవంతం చేశామని, రాబోయే ఏడాదిన్నర కాలంలో తెలంగాణ వ్యాప్తంగా సర్వేను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతున్న ఎల్-నినో కారణంగా రాబోయే రోజుల్లో కరువు పరిస్థితులు తీవ్రతరం అయ్యే ప్రమాదముందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సింగూరుతో పాటు రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టులన్నీ ఎండిపోయే పరిస్థితులు కనిపిస్తున్నాయని హెచ్చరించారు.
సాగు నీటి కంటే తాగునీటి అవసరాలకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. రైతులు ఎంతో అనుభవజ్ఞులని, కరువు ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈసారి రెండో పంట సాగు చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు కూడా క్షేత్రస్థాయి వాస్తవాలను రైతులకు వివరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
{{/usCountry}}సాగు నీటి కంటే తాగునీటి అవసరాలకే ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి పొంగులేటి తేల్చిచెప్పారు. రైతులు ఎంతో అనుభవజ్ఞులని, కరువు ముప్పును దృష్టిలో ఉంచుకుని ఈసారి రెండో పంట సాగు చేయవద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలు కూడా క్షేత్రస్థాయి వాస్తవాలను రైతులకు వివరిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
{{/usCountry}}గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా మిగిలిపోయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలను తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పూర్తి చేస్తోందన్నారు మంత్రి పొంగులేటి. కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఇప్పటికే 90 శాతం ఇళ్లను అర్హులైన పేదలకు కేటాయించామని తెలిపారు. మిగిలిన 10 శాతం ఇళ్ల కేటాయింపు ప్రక్రియను రాబోయే 15 రోజుల్లోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మరో 2 లక్షల ఇళ్లను మంజూరు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, పెండింగ్ నిధుల విడుదలపై కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రతిపక్ష నాయకులను కూడా కలుపుకొని త్వరలోనే ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలవనున్నట్లు వివరించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ రఘునందన్ రావు, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు ప్రతీక్ జైన్, హైమావతి, ప్రతిమ సింగ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.