కాంగ్రెస్ ప్రభుత్వంపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రజాపాలనలో రైతు ఉత్సవాల పేరుతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్‌పల్లిలో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ పాల్గొన్నారు. సభా వేదిక నుంచే రెండో విడత రైతు భరోసా నిధులను (రూ. 5,700 కోట్లు) విడుదల చేశారు.

రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించి ఏడాదిలోపే చేసి చూపించామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ కింద రూ.22 వేల కోట్లు వేశామని గుర్తుచేశారు. గత విడతలో రైతుభరోసా కింద 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు వేశామన్న సీఎం.. తాజాగా రెండో విడతగా రూ.5,700 కోట్లకుపైగా రైతుల ఖాతాల్లో జమ చేశామని చెప్పారు. మిగతా రూ.3,300 కోట్లు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు.
కేసీఆర్‌ను పాపాల భైరవుడుగా అభివర్ణిస్తూ రేవంత్ రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. ఫామ్‌హౌస్‌లో పడుకునే పాపాల భైరవుడు మళ్లీ ఎందుకు రావాలి? నేరెళ్లలో దళితులను ఇసుక లారీలతో తొక్కించినందుకా? అని అడిగారు. వాస్తు పేరుతో సచివాలయాన్ని కూల్చి, తండ్రి కొడుకులు తలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని ధ్వజమెత్తారు. పేదలకు బతుకమ్మ చీరల పేరుతో పనికిరాని బట్టలు పంచిన గడీల దొరల పాలన మళ్లీ రాకూడదని హెచ్చరించారు.
జీవన్ రెడ్డిపై రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయన చరిత్రంతా తెలుసు అన్నారు. 40 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి 14 సార్లు బీ-ఫామ్ ఇచ్చి గౌరవించిందని గుర్తు చేశారు. ఒక్క ఏడాది పదవి లేకపోతే కార్యకర్తల గుండెలపై తన్ని శత్రువుల పంచన చేరుతారా? అని ప్రశ్నించారు. జీవన్ రెడ్డి వెనకున్న మచ్చలన్నీ తనకు తెలుసని, ఆయన స్వార్థం కోసమే పార్టీ మారుతున్నారని ఆరోపించారు.
70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకరికి పదవి రాకపోతే.. ప్రజాప్రభుత్వం పోవాలా అన్నారు. బిడ్డ, కొడుకు, తండ్రి ఇలా తలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా? అని అడిగారు. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని ప్రకటించి పదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. '2029 ఎన్నికల్లో నీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా. ఆరోజు నువ్వో నేనో తేల్చుకుందాం.' ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.
{{/usCountry}}70 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి చరిత్ర సృష్టించామని రేవంత్ రెడ్డి అన్నారు. ఒకరికి పదవి రాకపోతే.. ప్రజాప్రభుత్వం పోవాలా అన్నారు. బిడ్డ, కొడుకు, తండ్రి ఇలా తలో ఫామ్‌హౌస్ కట్టుకున్నారని ఆరోపించారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలనే ఆలోచన ఏనాడైనా వచ్చిందా? అని అడిగారు. వేములవాడకు రూ.100 కోట్లు ఇస్తానని ప్రకటించి పదేళ్లలో ఒక్క రూపాయి ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అన్నారు. '2029 ఎన్నికల్లో నీ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేయకపోతే నా పేరు మార్చుకుంటా. ఆరోజు నువ్వో నేనో తేల్చుకుందాం.' ఛాలెంజ్ విసిరారు రేవంత్ రెడ్డి.
{{/usCountry}}