Singareni : సింగరేణిలో కొత్తగా 9 బొగ్గు గనుల ప్రాజెక్టులు.. ఈ ఏడాది మూడు స్టార్ట్
Singareni : సింగరేణిలో కొత్తగా 9 బొగ్గు గనుల ప్రాజెక్టులు రానున్నాయి. ఇందులో భాగంగా ఈ ఏడాది మూడు ప్రారంభించనున్నారు.
2027-28 నాటికి నాలుగు బొగ్గు గనుల కార్యకలాపాలు నిలిచిపోనుండటంతో వార్షిక బొగ్గు ఉత్పత్తి 12.51 మిలియన్ టన్నుల మేర తగ్గే అవకాశం ఉంది. దీంతో సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తొమ్మిది కొత్త బొగ్గు తవ్వకం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

ప్రతిపాదిత తొమ్మిది ప్రాజెక్టులు ఈ అంతరాన్ని పూడ్చి, రాబోయే రెండు దశాబ్దాల పాటు నిరంతరాయ బొగ్గు సరఫరాను అందిస్తాయని భావిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే కనీసం మూడు ప్రాజెక్టులలో ఉత్పత్తిని ప్రారంభించాలని ఎస్సీసీఎల్ అధికారులు యోచిస్తున్నారు.
దీర్ఘకాలిక కార్యాచరణ స్థిరత్వం, ఇంధన భద్రతను నిర్ధారించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది కొత్త ప్రాజెక్టులను గుర్తించింది. ఈ ప్రాజెక్టులలో కొత్త ఓపెన్-కాస్ట్ గనుల అభివృద్ధి, ఇప్పటికే ఉన్న గనుల విస్తరణ, గతంలో మూసివేసిన భూగర్భ గనుల నుండి మిగిలి ఉన్న బొగ్గు నిల్వలను వెలికితీయడం వంటివి ఉన్నాయి. తవ్వకాలు పూర్తి చేసుకుని మూతబడిన.. బొగ్గు గనుల లోతుల్లో ఉన్న బొగ్గును కూడా ఈ ప్రాజెక్టుల్లో భాగంగా తీస్తారు.
నిల్వలు తరిగిపోవడం వల్ల ప్రస్తుతం ఉన్న గనులను దశలవారీగా మూసివేయడం వలన ఏర్పడే ఉత్పత్తి నష్టాలను భర్తీ చేయడం, కార్మికులకు ఉపాధి కొనసాగింపు, రాష్ట్రంలో పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను తీర్చడం ఈ కొత్త ప్రాజెక్టుల లక్ష్యంగా సింగరేణి చెబుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు SCCL తొమ్మిది ప్రాజెక్టుల కోసం వివరణాత్మక ప్రతిపాదనలను సిద్ధం చేసి, అవసరమైన అనుమతుల కోసం కేంద్ర బొగ్గు, అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖలకు సమర్పించింది. మూడు ప్రాజెక్టులకు ఇప్పటికే అనుమతులు లభించాయి. ఒడిశా ప్రభుత్వ సమన్వయంతో ఒడిశాలోని నైని బ్లాక్‌లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభమైంది.
కొత్తగూడెం ప్రాంతంలోని వీకే బొగ్గు గని కూడా చట్టబద్ధమైన లాంఛనాలను పూర్తి చేసుకుని, ఉత్పత్తి ప్రారంభానికి సిద్ధంగా ఉంది. సుమారు 19 కోట్ల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ ప్రాజెక్ట్ చాలా కీలకమైనది. పైపొర తొలగింపు పనులు ప్రారంభమయ్యాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టును బొగ్గు ఉత్పత్తిని చేపట్టే అవకాశం ఉంది.
జేకే ఓపెన్‌కాస్ట్ గని (ఇల్లందు ప్రాంతం) - 19.68 మిలియన్ టన్నులు, రామగుండం ఓసీ-1 విస్తరణ ప్రాజెక్ట్- 181.60 మిలియన్ టన్నులు, గోలేటి ఓసీపీ (బెల్లంపల్లి ప్రాంతం) - 38.98 మిలియన్ టన్నులు, ఎంవీకే ఓసీపీ - 30.34 మిలియన్ టన్నులు, ఓపీకే-4 ఫేజ్ ఓపీ 4 మిలియన్ టన్నులు, మణుగూరు ఏరియాలో 40.45 మిలియన్ టన్నుల గల మణుగూరు ఓపెన్ కాస్ట్ ఎక్స్ టెన్షన్, 62 మిలియన్ టన్నుల గల పీకే కోల్ మైన్, కొండాపూర్, మందమర్రి ఏరియాలో 34.42 మిలియన్ టన్నుల గల ఆర్ కేపీఓసీపీ ఫేజ్-2 పేర్లతో పిలిచే 9 కొత్త ప్రాజెక్ట్‌లను చేపట్టనుంది సింగరేణి.
SCCL ఛైర్మన్, మరియు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి హైదరాబాద్‌లోని సింగరేణి భవన్‌లో సీనియర్ అధికారులతో ప్రతిపాదిత ప్రాజెక్టుల పురోగతిని అంచనా వేయడానికి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్య కాలపరిమితి ప్రకారం, పెండింగ్‌లో ఉన్న చట్టబద్ధమైన ఆమోదాలను వేగవంతం చేయాలని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోగా కనీసం మూడు ప్రాజెక్టుల నుంచి ఉత్పత్తి ప్రారంభమయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


