సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL) కార్మికులకు దసరా, దీపావళి పండుగల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. అర్హులైన కార్మికులకు ఒక్కొక్కరికి రూ. 1,10,250 చొప్పున భారీ బోనస్ అందించనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు.

అమావాస్య నీడల్లో, నేల గర్భంలో పగలు-రాత్రి తేడా లేకుండా ప్రాణాలను సైతం పణంగా పెట్టి దేశానికి వెలుగులు నింపుతున్న బొగ్గు గని కార్మికుల కృషి వెలకట్టలేనిదని కిషన్ రెడ్డి అభినందించారు. సింగరేణి అనేది కేవలం వ్యాపార దృక్పథంతో నడిచే బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదని, తెలంగాణ సంస్కృతిలో భాగమైన కొంగు బంగారం అని కొనియాడారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందన్నారు.
సింగరేణి సంస్థను మరింత బలపేతం చేయడానికి యాజమాన్యంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కేంద్ర మంత్రి సూచించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి సింగరేణి సంస్థకు అందవలసిన రూ. 60,000 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత, సింగరేణి భవిష్యత్తు కోసం సింగరేణి యాజమాన్యం, కార్మికులు మరింత సమన్వయంతో పనిచేయాలన్నారు.
భవిష్యత్ విద్యుత్ అవసరాలు, దేశ పరిశ్రమల ప్రగతిని దృష్టిలో ఉంచుకొని ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు రూపొందించాలని యాజమాన్యానికి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కార్మికుల సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో సింగరేణి బోర్డు ఎల్లప్పుడూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు.
'రానున్న దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయమైనది. దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి పరిశ్రమ మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి.' అని కిషన్ రెడ్డి అన్నారు.
{{/usCountry}}'రానున్న దసరా, దీపావళి, నవరాత్రుల పండుగల కానుకగా సింగరేణి కార్మికులకు ఒక్కొక్కరికి రూ.1,10,250 చొప్పున బోనస్ ఇవ్వాలని నిర్ణయమైనది. దేశానికి వెలుగులు పంచేందుకు పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్న సింగరేణి కార్మికుల శ్రమ వెలకట్టలేనిది. సింగరేణి బొగ్గు ఉత్పత్తి సంస్థ మాత్రమే కాదు. సింగరేణి పరిశ్రమ మన తెలంగాణ రాష్ట్రానికి కొంగు బంగారం. లక్షలాది కుటుంబాలకు జీవనాధారం. దేశాభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో కీలక భాగస్వామి.' అని కిషన్ రెడ్డి అన్నారు.
{{/usCountry}}బోనస్‌పై కొత్తగూడెం, మణుగురు, గోదావరిఖని, రామగుండం, మంచిర్యాల, భూపాలపల్లి తదితర సింగరేణి బొగ్గు గనుల ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. కార్మిక సంఘాలు కూడా ఈ బోనస్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ, సింగరేణి సంస్థ, కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశాయి. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థ అభివృద్ధి సాధించడంలో శ్రమిస్తున్న కార్మికులకు, ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ముందస్తుగా దసరా, నవరాత్రి, దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.