...
...
Next Story

TG Dasara Holidays 2026 : పాఠశాలలకు 13 రోజులు దసరా సెలవులు - ఇంటర్ కాలేజీలకు ఎన్ని రోజులంటే..?

Telangana Dasara Holidays 2026 : తెలంగాణలో అక్టోబర్ 10 నుంచి 22 వరకు పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటిస్తూ పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 23న బడులు తిరిగి తెరుచుకోనున్నాయి. ఇంటర్ కళాశాలల సెలవుల పట్టిక కూడా విడుదలైంది.

Published on: Oct 5, 2026, 06:02:22 IST
Advertisement

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు దసరా పండుగ సెలవుల సమయాన్ని పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలలకు విజయాదశమి సెలవులు ఇస్తున్నట్లు వెల్లడించింది. పండుగ సెలవుల అనంతరం అక్టోబర్ 23న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి.

దసరా సెలవులు - 2026
దసరా సెలవులు - 2026

ప్రస్తుతం పాఠశాలల్లో జరుగుతున్న సమ్మేటివ్ అసెస్మెంట్-1 (SA-1) పరీక్షలు అక్టోబర్ 9వ తేదీతో ముగియనున్నాయి. పరీక్షలు పూర్తయిన మరుసటి రోజు నుంచే విద్యార్థులకు ఈ దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

పరీక్ష సమయాల్లో స్వల్ప మార్పు…

అక్టోబర్ 9వ తేదీన జరగనున్న 9వ తరగతి పరీక్షల కాలపట్టికలో విద్యాశాఖ చిన్న మార్పు చేసింది. ఆ రోజు జరగాల్సిన ఇంగ్లీష్ పరీక్ష సమయాన్ని ఉదయం 9:15 గంటల నుంచి మధ్యాహ్నం 12:15 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

సెలవుల సమయంలో ఉపాధ్యాయులు మూల్యాంకనం పూర్తి చేస్తారు. పాఠశాలలు తిరిగి ప్రారంభమైన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. SA-2 పరీక్షలు 1 నుంచి 9వ తరగతి 2027 ఏప్రిల్ 9 నుండి ఏప్రిల్ 19 వరకు జరగనున్నాయి. పదో తరగతి ప్రీ-ఫైనల్స్ 2027 ఫిబ్రవరి 28 నాటికి పూర్తి కానున్నాయి.

ఇంటర్ కళాశాలల సెలవులు ఎప్పుడంటే..?

మరోవైపు రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు కూడా అక్టోబర్ 10వ తేదీ నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఇంటర్మీడియట్ విద్యార్థులకు అక్టోబర్ 21వ తేదీ వరకు మాత్రమే సెలవులు ఉంటాయి. దసరా విరామం తర్వాత అక్టోబర్ 22వ తేదీన జూనియర్ కళాశాలలను తిరిగి పునఃప్రారంభిస్తారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks