ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధిలోని దానాపూర్ డివిజన్‌లో నాన్-ఇంటర్‌లాకింగ్ మౌలిక వసతుల మెరుగుదల పనుల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు కీలక రైళ్ల మార్గాలను మళ్లిస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రయాణించే పలు సర్వీసులపై ఈ ప్రభావం ఉండనుంది.

రైల్వే ట్రాక్‌ల ఆధునీకరణ, సిగ్నలింగ్ వ్యవస్థ మెరుగుదల, భద్రతా ప్రమాణాల పెంపు కోసం ఈ నాన్-ఇంటర్‌లాకింగ్ పనులను చేపడుతున్నారు. హైదరాబాద్, చర్లపల్లి, మైసూర్ నుండి బీహార్‌లోని దర్భంగా, రక్సాల్ వెళ్లే ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను రూపకల్పన చేసుకోవాలని రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు. మళ్లించిన రైళ్ల వివరాలు ఇక్కడ ఉన్నాయి.
17005 హైదరాబాద్ – రక్సాల్ 24.09.2026 తేదీన కియుల్ – మోంగీర్ - బరౌని నుంచి మళ్లింపు.
17008 దర్భంగా – చర్లపల్లి 25.09.2026 తేదీన మోంగీర్ – కియుల్ నుంచి మళ్లింపు.
12578 మైసూర్ – దర్భంగా 25.09.2026 తేదీన దానాపూర్ – పాట్లీపుత్ర – ముజఫ్ఫర్‌పూర్ – సమస్తిపూర్ నుంచి మళ్లింపు.
17007 చర్లపల్లి – దర్భంగా 26.09.2026 రోజున కియుల్ – మోంగీర్ – బరౌని నుంచి దారి మళ్లింపు.
17007 చర్లపల్లి – దర్భంగా 29.09.2026 తేదీన కియుల్ – మోంగీర్ – బరౌని నుంచి మళ్లింపు.
12577 దర్భంగా – మైసూర్ 29.09.2026 సమస్తిపూర్ – ముజఫ్ఫర్‌పూర్ – పాట్లీపుత్ర – దానాపూర్ నుంచి మళ్లింపు.
17005 హైదరాబాద్ – రక్సాల్ 01.10.2026 రోజున కియుల్ – జామాల్పూర్ – మోంగీర్ నుంచి మళ్లింపు.
{{/usCountry}}17005 హైదరాబాద్ – రక్సాల్ 01.10.2026 రోజున కియుల్ – జామాల్పూర్ – మోంగీర్ నుంచి మళ్లింపు.
{{/usCountry}}17008 దర్భంగా – చర్లపల్లి 02.10.2026 తేదీన మోంగీర్ – కియుల్ నుంచి మళ్లింపు.
17006 రక్సాల్ – హైదరాబాద్ 04.10.2026 తేదీన మోంగీర్ – కియుల్ నుంచి మళ్లిస్తారు.
రైళ్లు వేరే మార్గంలో మళ్లించటం వలన సాధారణ సమయం కంటే కాస్త ఆలస్యంగా నడిచే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కావున ప్రయాణికులు కింద పేర్కొన్న నిబంధనలను పరిశీలించవలసిందిగా సూచించారు. మళ్లించిన మార్గాల్లో కొన్ని రెగ్యులర్ స్టేషన్లలో రైళ్లు ఆగకపోవచ్చు. మళ్లించిన రూట్లలో ప్యాసింజర్ల రద్దీని బట్టి తాత్కాలిక సాంకేతిక స్టాప్‌లు కేటాయించే అవకాశం ఉంది.
రైళ్లు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వెళ్తున్నందున గమ్యస్థానాలకు చేరుకునే సమయంలో మార్పులు ఉంటాయి. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు రైల్వే అధికారిక యాప్ ‘National Train Enquiry System’ (NTES) ద్వారా కానీ లేదా 139 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేసి రైలు ప్రస్తుత స్థితిని తెలుసుకోవచ్చు.
పైన పేర్కొన్న తేదీల్లో రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు వారి మొబైల్ నంబర్లకు ఐఆర్‌సిటీసీ ద్వారా సందేశాలు వస్తాయి. ప్రయాణికులు ఈ సమాచారాన్ని గమనించి రైల్వే శాఖకు సహకరించాలి.