దక్షిణ మధ్య రైల్వే చేస్తున్న పనుల ప్రకారం.. రైల్వే బోర్డు ద్వారా తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలలో సుమారు రూ.50,000 కోట్ల విలువైన రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. ఇందుపల్లి-దుగ్గిరాల మధ్య బైపాస్ లైన్ మాత్రమే కాదు.. 781.6 కిలోమీటర్ల బల్హర్షా-కాజీపేట-విజయవాడ-గూడూరు కారిడార్ అత్యంత ముఖ్యమైన ప్రతిపాదనలలో ఒకటి. రూ.16,800 కోట్లకు పైగా వ్యయం అవుతుందని అంచనా వేసిన ఈ ప్రాజెక్ట్ రైల్వే బోర్డులో కీలక దశలను క్లియర్ చేసింది, పరిశీలనలో ఉంది.

బల్హర్షా-కాజీపేట, కాజీపేట-విజయవాడ సామర్థ్య పెంపుదల ప్రణాళికలో ఉన్నట్టుగా అధికారులు తెలిపారు. ఈ రూట్‌లో సరకు రవాణా, ప్రయాణికులు ఎక్కువగా ఉంటారు. 173-కిమీ సికింద్రాబాద్-వాడి మూడు, నాల్గో లైన్ రూ.5,102 కోట్లతో మంజూరు అయింది. నెట్‌వర్క్‌లో ప్రస్తుతం ఉన్న రద్దీని తగ్గించడానికి సనత్‌నగర్-హఫీజ్‌పేట్, హఫీజ్‌పేట్-వాడి మధ్య మూడో/నాల్గో లైన్‌ను నిర్మించడం ఇందులో భాగంగా ఉంది.
ఇటీవలే కేంద్రం నుండి ఆమోదం పొందిన రూ.2,200 కోట్ల ప్రాజెక్ట్‌తో తెలంగాణలోని 110.4-కిమీ కాజీపేట-సికింద్రాబాద్ లైను ఇప్పటికే ఊపందుకున్న ప్రధాన ప్రాజెక్ట్‌గా చెప్పవచ్చు. రద్దీగా ఉండే బల్హర్షా-నాగ్‌పూర్ మార్గంలో ప్రాంతీయ కనెక్టివిటీని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి రూ.493 కోట్ల వ్యయంతో యవత్మాల్ జిల్లాలోని మకుత్‌బాన్, చంద్రపూర్ జిల్లాలోని గోడ్‌చందూర్ మధ్య 38.21-కిమీ కొత్త రైలు మార్గాన్ని కూడా క్లియర్ చేసింది. 130-కిమీ వికారాబాద్-కృష్ణా కొత్త లైన్ ప్రాజెక్ట్ రూ.2,884 కోట్ల అంచనాతో ఉంది.
హైదరాబాద్ చుట్టూ ప్రతిపాదిత 222.5-కిమీ రీజినల్ రింగ్ రైల్ (ఉత్తరం) రూ.11,500 కోట్ల అంచనా వ్యయంతో సౌత్ సెంట్రల్ అధికారులు ప్రాజెక్ట్‌ను క్లియర్ చేసి రైల్వే బోర్డుకు ఫార్వార్డ్ చేశారు. బొగ్గు, పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానించే మణుగూరు-రామగుండం లైన్‌ను పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) పద్ధతిలో చేపట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ అనుమతించింది.
సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా డోర్నకల్-గద్వాల్ రైలు మార్గానికి రూ.8,269 కోట్ల కంటే ఎక్కువ వ్యయం అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఇది చర్చల దశలో ఉంది. దీనితోపాటుగా మరికొన్ని ప్రాజెక్టులపై సమీక్షలు జరుగుతున్నాయి.
{{/usCountry}}సూర్యాపేట, నల్గొండ, నాగర్‌కర్నూల్, వనపర్తి మీదుగా డోర్నకల్-గద్వాల్ రైలు మార్గానికి రూ.8,269 కోట్ల కంటే ఎక్కువ వ్యయం అవుతుందని అంచనా వేశారు అధికారులు. ఇది చర్చల దశలో ఉంది. దీనితోపాటుగా మరికొన్ని ప్రాజెక్టులపై సమీక్షలు జరుగుతున్నాయి.
{{/usCountry}}