దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని కాజీపేట-బల్లార్షా రైల్వే సెక్షన్ ఆధునీకరణ పనులు వేగవంతమయ్యాయి. రైళ్ల రాకపోకల్లో మరింత భద్రత, వేగం పెంచేందుకు గాను ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఈ మార్గంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

దీనిలో భాగంగా జమ్మికుంట-పొత్కపల్లి స్టేషన్ల నడుమ సుమారు 17 కిలోమీటర్ల పరిధిలో నాన్ ఇంటర్‌లాకింగ్ సాంకేతిక పనులు చేపట్టనున్నారు. ఈ మరమ్మతులు, సాంకేతిక పనుల కారణంగా సెప్టెంబర్ 10న పలు ప్యాసింజర్, మెము, ఎక్స్‌ప్రెస్ రైళ్లను పూర్తిగా, మరికొన్నింటిని పాక్షికంగా రద్దు చేయడంతో పాటు కీలక సూపర్‌ఫాస్ట్ రైళ్లను రీషెడ్యూల్ లేదా నియంత్రించనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
పలు రైళ్లు రద్దు
రైలు నం. 17003 / 17004 కాజీపేట - సిర్పూర్ టౌన్, బల్లార్షా - కాజీపేట రామగిరి మెము ఎక్స్‌ప్రెస్ రైళ్లను సర్వీస్ నుంచి పూర్తిగా రద్దు చేశారు.
సింగరేణి మెము ఎక్స్‌ప్రెస్ (17033 / 17034) భద్రాచలం రోడ్ - బల్లార్షా మధ్య నడిచే ఈ రైలును వరంగల్ - బల్లార్షా మధ్య రద్దు చేశారు. సిర్పూర్ టౌన్ - భద్రాచలం రోడ్ మధ్య నడిచే సర్వీస్‌ను సిర్పూర్ టౌన్ - వరంగల్ మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (17011 / 17012) హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్-బీదర్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేట - సిర్పూర్ కాగజ్‌నగర్ స్టేషన్ల మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
రైళ్లు సమయాల్లో మార్పులు
భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233) సెప్టెంబర్ 10న సికింద్రాబాద్ నుంచి బయలుదేరాల్సిన ఈ రైలు నిర్ణీత సమయం కంటే 1 గంట (60 నిమిషాలు) ఆలస్యంగా బయలుదేరుతుంది.
మెము ప్యాసింజర్ (67771 / 67773) సిర్పూర్ టౌన్ - కరీంనగర్, కరీంనగర్ - బోధన్ మధ్య నడిచే మెము ప్యాసింజర్‌ను కూడా 1 గంట పాటు రీషెడ్యూల్ చేశారు.
నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. దానాపూర్ - ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్(22365) సెప్టెంబర్ 9న బయలుదేరే ఈ రైలును మార్గమధ్యంలో 75 నిమిషాల పాటు ఆపుతారు.
{{/usCountry}}నాన్-ఇంటర్‌లాకింగ్ పనుల వల్ల సుదూర ప్రాంతాలకు వెళ్లే పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. దానాపూర్ - ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు ఎక్స్‌ప్రెస్(22365) సెప్టెంబర్ 9న బయలుదేరే ఈ రైలును మార్గమధ్యంలో 75 నిమిషాల పాటు ఆపుతారు.
{{/usCountry}}ఎస్‌ఎమ్‌వీటీ బెంగళూరు - దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (22366) సెప్టెంబర్ 9న బయలుదేరే ఈ సర్వీస్‌ను 45 నిమిషాలు ఆలస్యంగా నడుపుతారు.
తమిళనాడు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12622) న్యూఢిల్లీ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే ఈ రైలును సెప్టెంబర్ 9న 30 నిమిషాల పాటు నిలిపివేస్తారు.
అండమాన్ ఎక్స్‌ప్రెస్ (12622) చెన్నై సెంట్రల్ - శ్రీమాత వైష్ణోదేవి కట్రా మధ్య నడిచే ఈ ట్రై-వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను సెప్టెంబర్ 10న 30 నిమిషాల పాటు కంట్రోల్ చేయనున్నారు.
ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ ఉపయోగం ఏంటి?
రైల్వే వ్యవస్థలో సిగ్నలింగ్ సాంకేతికత అత్యంత కీలకమైనది. గతంలో ఒక సెక్షన్‌లో ఒక రైలు ఉంటే, అది తదుపరి స్టేషన్ దాటే వరకు మరొక రైలును అనుమతించేవారు కాదు. కానీ ఈ ఆటోమేటిక్ బ్లాక్ సిగ్నలింగ్ పద్ధతి ద్వారా.. ఒక్కో సెక్షన్‌ను చిన్న బ్లాకులుగా విభజించి, ప్రతి కిలోమీటరుకు సిగ్నళ్లను ఏర్పాటు చేస్తారు. ఒకే ట్రాక్‌పై తక్కువ వ్యవధిలోనే ఒకదాని వెనుక మరొక రైలును సురక్షితంగా నడపవచ్చు.
దీనివల్ల రైళ్ల వేగం పెరగడమే కాకుండా, స్టేషన్ల వెలుపల రైళ్లు వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే కాజీపేట - జమ్మికుంట, మంచిర్యాల - సిర్పూర్ కాగజ్‌నగర్ సెక్షన్లలో ఈ ఆటోమేటిక్ సిగ్నలింగ్ విధానం పూర్తికాగా, ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా పరిధిలోని పొత్కపల్లి - పెద్దంపేట మార్గంలో చివరిదశ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ప్రయాణికులు ఈ మార్పులను గమనించి తమ ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని రైల్వే శాఖ విజ్ఞప్తి చేసింది.