...
...
Next Story

చర్లపల్లి – చెన్నై సెంట్రల్ స్పెషల్ ట్రైన్స్.. ఏపీ, తెలంగాణలో ఈ స్టేషన్లలో స్టాప్‌లు

Charlapalli-Chennai Special Trains : పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఏపీ, తెలంగాణ మీదుగా ఈ ట్రైన్స్ నడవనున్నాయి.

Published on: Nov 2, 2026, 20:11:24 IST
Advertisement

పండుగల సీజన్‌లో ప్రయాణికుల రాకపోకలు, విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. చర్లపల్లి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ స్టేషన్ల మధ్య ప్రత్యేక పూజా పండుగ రైళ్లను (Puja Festival Special Trains) నడపనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కార్యాలయం అధికారిక ప్రత్రికా ప్రకటన విడుదల చేసింది.

దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్
దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్

పండుగల వేళ సొంత ఊళ్లకు, చెన్నై మార్గానికి ప్రయాణించే వారి సౌకర్యార్థం నడిపే ఈ ప్రత్యేక రైళ్ల షెడ్యూల్ వివరాలు కింది విధంగా ఉన్నాయి. ఈ ప్రత్యేక రైళ్లు ఇరు మార్గాల్లోనూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయని రైల్వే అధికారులు తెలిపారు.

07059 చర్లపల్లి – చెన్నై సెంట్రల్ రైలు 06.11.2026 రాత్రి 9:30 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు చెన్నై చేరుకుంటుంది.

07060 చెన్నై సెంట్రల్ – చర్లపల్లి ట్రైన్ 07.11.2026న మధ్యాహ్నం 12:40 గంటలకు చెన్నై నుంచి బయల్దేరి.. మరుసటి రోజు తెల్లవారుజామున 04:30 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.

తెలంగాణ ప్రాంతంలో నల్గొండ, మిర్యాలగూడ, ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరులో ఆగుతుంది. ఈ పూజా ప్రత్యేక రైళ్లలో ప్రయాణికులకు అనువుగా స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లను అందుబాటులో ఉంచారు. చెన్నై, ఏపీలోని కోస్తా జిల్లాలకు ప్రయాణించే ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ముందస్తుగానే తమ ప్రయాణ ప్రణాళికలు రూపొందించుకుని IRCTC లేదా రిజర్వేషన్ కౌంటర్లలో టిక్కెట్లు బుక్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సూచించారు.

తిరుగు ప్రయాణంలో పోదనూర్-చెన్నై సెంట్రల్ స్పెషల్ (06024) నవంబర్ 9వ తేదీ రాత్రి 11:30 గంటలకు పోదనూర్ నుండి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:35 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లను పెరంబూర్, తిరువళ్లూరు, అరక్కోణం, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్ మీదుగా నడుపుతారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks