SCR Special Trains Extension : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ నుంచి దక్షిణ భారతంలో ఉన్న ప్రధాన నగరాలకు వెళ్లే రైళ్లకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో పలు ప్రత్యేక రైళ్లను పొడిగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా… హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ మధ్య నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది.

వేసవి ప్రయాణాలు, పండుగల సీజన్ దృష్ట్యా ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక సర్వీసులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. సీట్లు త్వరితగతిన నిండిపోతుండటం, వెయిటింగ్ లిస్ట్ పెరుగుతుండటంతో ఈ సేవా కాలాన్ని మరికొన్ని వారాల పాటు పొడిగించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
పొడిగించిన రైళ్ల వివరాలు :
- హైదరాబాద్ - మంగళూరు సెంట్రల్ ప్రత్యేక రైలు (నంబర్ 07097) : ఈ ప్రత్యేక రైలు ఆగస్టు 5, 12, 19, 26 తేదీలలో (ప్రతి బుధవారం) హైదరాబాద్ స్టేషన్ నుంచి మంగళూరు సెంట్రల్‌కు బయలుదేరుతుంది.
- మంగళూరు సెంట్రల్ - హైదరాబాద్ ప్రత్యేక రైలు (నంబర్ 07098) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఆగస్టు 6, 13, 20, 27 మరియు సెప్టెంబరు 3వ తేదీలలో (ప్రతి గురువారం) మంగళూరు సెంట్రల్ నుంచి హైదరాబాద్‌కు తన సేవలను అందిస్తుంది.
స్టాపేజీలు…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల గుండా సాగే ఈ ప్రత్యేక రైళ్లు ప్రయాణికుల సౌకర్యార్థం పలు ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి. ఇందులో బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, గుంతకల్, అనంతపురం, యలహంక, కృష్ణరాజపురం, సేలం, పాలక్కాడ్, కోళికోడ్, వడకర, కాసర్‌గోడ్ స్టేషన్లు ఉన్నాయి.
ఈ సర్వీసుల పొడిగింపుతో స్వగ్రామాలకు వెళ్లే వారితో పాటు ఉద్యోగ, వ్యాపార రీత్యా మంగళూరు, బెంగళూరు వైపు ప్రయాణించే తెలుగు ప్రయాణికులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్లు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ మరియు యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని…. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
{{/usCountry}}ఈ సర్వీసుల పొడిగింపుతో స్వగ్రామాలకు వెళ్లే వారితో పాటు ఉద్యోగ, వ్యాపార రీత్యా మంగళూరు, బెంగళూరు వైపు ప్రయాణించే తెలుగు ప్రయాణికులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది. రైలు టికెట్ల ముందస్తు రిజర్వేషన్లు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ మరియు యాప్ ద్వారా అందుబాటులో ఉంటాయని…. ప్రయాణికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే అధికారులు కోరారు.
{{/usCountry}}