తెలంగాణలోని ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు వారి సొంత జిల్లాల్లోనే అందుబాటులోకి తీసుకురావడం మా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. ఈ లక్ష్య సాధనలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి మౌలిక సదుపాయాలు, స్పెషలిస్ట్ వైద్య సేవలు, అవసరమైన వైద్య సిబ్బంది, ఆధునిక డయాగ్నస్టిక్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు.

ఇటీవల డీఎస్‌హెచ్ పరిధిలో 1,616 మంది స్పెషలిస్ట్ వైద్యులను నియమించడంతో పాటు అవసరమైన నర్సులు, టెక్నీషియన్ల నియామకాలు కూడా చేపట్టామని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ నియామకాల ఫలితాలు ప్రజలకు అందాలంటే ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న సిబ్బందిని, వైద్య పరికరాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.
'స్పెషలిస్ట్ వైద్యులు ఉన్నప్పటికీ అవసరమైన పరికరాలు, సిబ్బంది లేక వైద్య సేవలు అందించలేని పరిస్థితి ఉండకూడదు. అందుకే ప్రతి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవలు, అవసరమైన స్పెషాలిటీ విభాగాలు, వైద్యులు, నర్సింగ్, పారామెడికల్ సిబ్బంది, వైద్య పరికరాలు, డయాగ్నస్టిక్ సదుపాయాలపై సమగ్ర సమీక్ష చేపట్టాలి.' అని దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
30, 50, 100 పడకలు, అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన ఆసుపత్రులకు వాటి స్థాయికి అనుగుణంగా వైద్య సేవల పరిధిని నిర్ణయించాలన్నారు మంత్రి. సీహెచ్‌సీలు, ఏరియా హాస్పిటళ్లు, జిల్లా హాస్పిటళ్లలో అవసరమైన స్పెషాలిటీ విభాగాలు, పడకలు, ఆపరేషన్ థియేటర్లు, ల్యాబ్‌లు, ఇతర సదుపాయాలపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు.
కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన ఇండియన్ పబ్లిక్ హెల్త్ స్టాండర్డ్స్(IPHS) మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రంలోని సెకండరీ హెల్త్ కేర్ ఆసుపత్రులను అభివృద్ధి చేయాలని ఆదేశించారు దామోదర రాజనర్సింహ. ప్రస్తుతం ఉన్న సిబ్బంది, మంజూరైన పోస్టులు, అవసరమైన సిబ్బంది సంఖ్యను పోల్చి చూసి, లోటుపాట్లను గుర్తించి, అవసరమైన అదనపు పోస్టులపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్పష్టమైన పరిపాలనా బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు మంత్రి. రోగులకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడం, వైద్య సేవల నాణ్యతను పెంచడం, ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచడం తమ ప్రాధాన్యత అన్నారు.
{{/usCountry}}ప్రతి జిల్లాలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్ కార్యాలయాలను ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్పష్టమైన పరిపాలనా బాధ్యతలు, నిరంతర పర్యవేక్షణ వ్యవస్థ ఉండాలని భావిస్తున్నామని చెప్పారు మంత్రి. రోగులకు ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించడం, వైద్య సేవల నాణ్యతను పెంచడం, ఆసుపత్రుల పనితీరును మెరుగుపరచడం తమ ప్రాధాన్యత అన్నారు.
{{/usCountry}}ప్రజలకు నాణ్యమైన వైద్యం వారి జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకూ హైదరాబాద్‌కు వెళ్లాల్సిన పరిస్థితి తగ్గాలని, ప్రతి జిల్లాలో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో సెకండరీ హెల్త్ కేర్ వ్యవస్థను పటిష్టం చేస్తున్నామన్నారు.
సచివాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్(తెలంగాణ వైద్య విధాన పరిషత్ – TVVP) పునర్వ్యవస్థీకరణపై నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈ అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ASCI) రూపొందించిన అధ్యయన నివేదికలోని ప్రతిపాదనలను సమీక్షించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రభుత్వ సంకల్పమన్నారు.