...
...
Next Story

SCR Train Cancellations : ప్రయాణికులకు అలర్ట్... ఈనెల 17 వరకు హైదరాబాద్ - ముంబై రైళ్లు రద్దు!

SCR Train Cancellations : ముంబై, హైదరాబాద్, చెన్నై మార్గాల్లో నడిచే పలు కీలక రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. జూలై 10 నుంచి 17 వరకు ఈ రద్దు నిర్ణయం అమలులో ఉంటుంది.

Published on: Jul 10, 2026 06:15 PM IST
Advertisement

తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే కీలక అలర్ట్ జారీ చేసింది. ముంబై డివిజన్ పరిధిలోని కర్జాత్ - లోనావాలా సెక్షన్‌లో కురుస్తున్న భారీ వర్షాలు, దానికి తోడు కొండచరియలు విరిగిపడటంతో ఈ మార్గంలో నడిచే పలు రైళ్లను రైల్వే శాఖ పూర్తిగా రద్దు చేసింది.

పలు రైళ్లు రద్దు (image source @GMSRailway)
పలు రైళ్లు రద్దు (image source @GMSRailway)

జూలై 10వ తేదీ నుంచి జూలై 17వ తేదీ వరకు వారం రోజుల పాటు ఈ రైళ్ల రద్దు నిర్ణయం అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. ముఖ్యంగా హైదరాబాద్, ముంబై, చెన్నై నగరాల మధ్య రాకపోకలు సాగించే ప్రయాణికులపై ఈ ప్రభావం పడనుంది.

రద్దయిన రైళ్ల వివరాలు:

  • ట్రైన్ నెంబర్ 22732 (CST ముంబై - హైదరాబాద్): జూలై 10, 2026 నుంచి జూలై 17, 2026 వరకు ఈ సర్వీసును రద్దు చేశారు.
  • ట్రైన్ నెంబర్ 22731 (హైదరాబాద్ - CST ముంబై): హైదరాబాద్ నుంచి బయలుదేరే ఈ రైలు కూడా జూలై 10 నుంచి జూలై 17 వరకు అందుబాటులో ఉండదు.
  • ట్రైన్ నెంబర్ 22157 (CST ముంబై - చెన్నై): ముంబై నుంచి చెన్నై వెళ్లే ఈ రైలును జూలై 10 నుంచి జూలై 17 వరకు నిలిపివేశారు.
  • ట్రైన్ నెంబర్ 22158 (చెన్నై - CST ముంబై): చెన్నై నుంచి ముంబై వెళ్లే తిరుగు ప్రయాణ సర్వీసును సైతం ఇదే కాలానికి (10.07.2026 నుండి 17.07.2026 వరకు) రద్దు చేశారు.

ప్రకృతి వైపరీత్యం వల్ల తలెత్తిన ఈ అవాంతరానికి ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి రైల్వే యంత్రాంగం విచారం వ్యక్తం చేసింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రయాణికులు సహకరించాలని కోరింది. రైళ్ల పునరుద్ధరణ, తాజా అప్‌డేట్ల కోసం ప్రయాణికులు అధికారిక రైల్వే వెబ్‌సైట్ లేదా హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe