హైదరాబాద్ నగరంలో నిత్యం ప్రయాణించే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించబోతోంది. గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మెట్రో రైళ్లు, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేందుకు వీలుగా రూపొందించిన ఉమ్మడి పాస్ ధరలను గణనీయంగా తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. గతంలో నిర్ణయించిన ధరలు సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులకు భారం కావడంతో ఊహించిన స్థాయిలో స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో ప్రజా రవాణాను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఛార్జీలను సగానికి పైగా తగ్గించేందుకు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.

గతంలో ఉమ్మడి నెలవారీ పాస్ ధరను రూ. 8,500గా నిర్ణయించారు. ఇది ఐటీ ఉద్యోగులు, సాధారణ ప్రయాణికులకు కూడా అధికంగా అనిపించడంతో అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం ఈ ధరను రూ. 4,000 లేదా రూ. 4,500కు తగ్గించనున్నారు. రూ. 4,000గా నిర్ణయిస్తే ఇందులో ఆర్టీసీకి రూ. 1,000, మెట్రో యాజమాన్యానికి రూ. 3,000 లేదా రూ. 3,500 వెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఒకే రోజులో మల్టిపుల్ రూట్లలో ప్రయాణించే వారి కోసం అందుబాటులో ఉన్న డైలీ పాస్ ధరను కూడా తగ్గించారు. పాత ధర రూ. 400 ఉండగా కొత్త ధర ప్రకారం రూ. 325 చేశారు. ఆర్టీసీ ఖాతాలోకి రూ. 75, మెట్రో రైలు యాజమాన్యానికి రూ. 250 చొప్పున వెళ్తాయి. దీనితో రోజంతా మెట్రో, ఆర్టీసీలో హైదరాబాద్ పరిధిలో ఎక్కడికైనా వెళ్లవచ్చు.
ఈ పాస్ ధరల సవరణపై సచివాలయంలో కీలక అడుగు పడింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి, మెట్రో రైలు సలహాదారు ఎన్వీఎస్ రెడ్డి ఇప్పటికే ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక ఒప్పందానికి వచ్చారు. ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో ఆర్టీసీ ఎండీ, మెట్రో సలహాదారు త్వరలోనే భేటీ కానున్నారు. సీఎస్ ఆమోదం లభించిన వెంటనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీపావళి పండుగ కానుకగా ఈ తగ్గించిన ధరలను అమల్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
ఈ పాస్‌తో మెట్రో స్టేషన్ వరకూ ఆర్టీసీలో బస్సుల్లో వచ్చి, అక్కడి నుండి మెట్రోలో గమ్యస్థానానికి వెళ్లేవారికి విడివిడిగా టికెట్లు తీసుకునే శ్రమ తప్పుతుంది. వ్యక్తిగత వాహనాల్లో పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే నెలవారీ రూ. 4,000 పాస్ ఐటీ ఉద్యోగులకు, రోజువారీ వ్యాపారులకు ఎంతో లాభదాయకం. చౌకైన ఉమ్మడి పాస్‌ల వల్ల ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గి, నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
{{/usCountry}}ఈ పాస్‌తో మెట్రో స్టేషన్ వరకూ ఆర్టీసీలో బస్సుల్లో వచ్చి, అక్కడి నుండి మెట్రోలో గమ్యస్థానానికి వెళ్లేవారికి విడివిడిగా టికెట్లు తీసుకునే శ్రమ తప్పుతుంది. వ్యక్తిగత వాహనాల్లో పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే నెలవారీ రూ. 4,000 పాస్ ఐటీ ఉద్యోగులకు, రోజువారీ వ్యాపారులకు ఎంతో లాభదాయకం. చౌకైన ఉమ్మడి పాస్‌ల వల్ల ప్రైవేట్ వాహనాల వినియోగం తగ్గి, నగరంలో కాలుష్యం, ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయి.
{{/usCountry}}