సింగరేణి నుంచి శుభవార్త - కార్మికుల క్రమబద్ధీకరణకు ఉత్తర్వులు, జాబితాల సమర్పణకు ఆదేశాలు
Singareni worker regularization : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కీలక నిర్ణయం తీసుకుంది. బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న సుమారు 1,135 మంది కార్మికులను జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరించేందుకు యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది.
Singareni worker regularization : సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) కార్మికులకు తెలంగాణ ప్రజా ప్రభుత్వం తీపి కబురు అందించింది. సుదీర్ఘకాలంగా క్రమబద్ధీకరణ కోసం ఎదురుచూస్తున్న 1,135 మంది కార్మికుల కల నెరవేరింది. బదిలీ వర్కర్లు, జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న వారిని 'జనరల్ అసిస్టెంట్లు'గా క్రమబద్ధీకరిస్తూ సంస్థ యాజమాన్యం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఇటీవల కోల్ బెల్ట్ ప్రజాప్రతినిధులతో నిర్వహించిన కీలక సమావేశంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి భట్టి విక్రమార్క కార్మికులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. గత రెండు మూడు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కార్మికుల సమస్యను పరిష్కరిస్తామని ప్రకటించిన ఆయన, ఇచ్చిన మాట ప్రకారం యాజమాన్యంతో మాట్లాడి ఈ ప్రక్రియను వేగవంతం చేయించారు.
క్రమబద్ధీకరణకు అర్హతలు
- 2025 డిసెంబర్ 31 కంటే ముందు ఉద్యోగంలో చేరి బదిలీ వర్కర్లు లేదా జనరల్ అసిస్టెంట్ ట్రైనీలుగా పనిచేస్తున్న వారికి ఈ అవకాశం వర్తిస్తుంది.
- భూగర్భ గనుల్లో పనిచేసేవారు కనీసం 190 పని దినాలు, ఓపెన్ కాస్ట్ గనులు లేదా ఇతర విభాగాల్లో పనిచేసేవారు కనీసం 240 పని దినాలు పూర్తి చేసి ఉండాలి.
- 2025 డిసెంబర్ 31 నాటికి లేదా అంతకుముందు ఏదైనా క్యాలెండర్ సంవత్సరంలో నిర్దేశిత పని దినాలు పూర్తి చేసినవారు అర్హులు.
సింగరేణి ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి ఆదేశాల మేరకు జనరల్ మేనేజర్ (పర్సనల్), ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్‌మెంట్ విభాగం క్రమబద్ధీకరణపై సర్క్యులర్ జారీ చేసింది. ఆయా ఏరియాల్లో పనిచేస్తున్న అర్హులైన కార్మికుల జాబితాలను నవంబర్ 23లోగా సమర్పించాలని ఏరియా జనరల్ మేనేజర్లకు తెలియజేశారు. అర్హులైన ఉద్యోగులకు 2026 సెప్టెంబర్ 1 నుంచి క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. తాజా నిర్ణయంపై కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కార్మికులు గైర్హాజరు లేకుండా క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని సింగరేణి యాజమాన్యం సూచించింది. క్రమం తప్పకుండా విధులకు హాజరవడం వల్ల ఉత్పత్తి, ఉత్పాదకత పెరగడంతోపాటు సంస్థ అందించే సంక్షేమ ప్రయోజనాలను పొందే అవకాశాలు మెరుగుపడతాయని తెలిపింది.
గతంలో జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ పొందిన పలువురు ఉద్యోగులు తమ విద్యార్హతలు, ఉద్యోగ అర్హతల ఆధారంగా అంతర్గత నియామకాలు, పదోన్నతుల ద్వారా మెరుగైన ఉద్యోగ అవకాశాలు పొందారని గుర్తుచేసింది.
గైర్హాజరు కారణంగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రాకుండా కార్మికులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, సంస్థ అభివృద్ధికి, ఉత్పాదకత పెంపునకు కృషి చేయాలని ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి కోరారు.
కార్మికులకు ఉప ముఖ్యమంత్రి శుభాకాంక్షలు
జనరల్ అసిస్టెంట్లుగా క్రమబద్ధీకరణ పొందనున్న కార్మికులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి శ్రీ భట్టి విక్రమార్క శుభాకాంక్షలు తెలిపారు. సింగరేణి ఉద్యోగులకు ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వస్తోందని పేర్కొన్నారు. సింగరేణి అభివృద్ధి, విస్తరణకు ఉద్యోగులు క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పూర్తి సహకారం అందించాలని పిలుపునిచ్చారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

