వేసవి సెలవుల దృష్ట్యా రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరుగుతోంది. ఈ రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని చర్లపల్లి (Charlapalli) రైల్వే స్టేషన్ నుంచి జసిదిహ్, ముజఫర్‌పూర్, బరౌనీ వంటి ప్రధాన నగరాలకు సమ్మర్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు:

ఈ ప్రత్యేక సర్వీసులు ఏప్రిల్ 23 నుంచి మే 3, 2026 వరకు అందుబాటులో ఉంటాయి. ఒక్కో రైలు కేవలం ఒక సర్వీసును మాత్రమే అందిస్తుంది.
- చర్లపల్లి - జసిదిహ్ (Jasidih): చర్లపల్లి(రైలు నంబర్లు 07580, 07586) నుంచి గురువారాల్లో (ఏప్రిల్ 23, 30) బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో జసిదిహ్ - చర్లపల్లి (07581, 07587) రైళ్లు శుక్రవారాల్లో నడుస్తాయి.
- చర్లపల్లి - ముజఫర్‌పూర్ (Muzaffarpur): చర్లపల్లి(రైలు నంబర్లు 07582, 07584,07590) నుంచి వివిధ తేదీల్లో (ఏప్రిల్ 28, ఏప్రిల్ 24 మరియు మే 01) బయలుదేరుతాయి. తిరుగు ప్రయాణంలో ముజఫర్‌పూర్ - చర్లపల్లి (07583, 07585, 07591) రైళ్లు అందుబాటులో ఉన్నాయి.
- చర్లపల్లి - బరౌనీ: ఏప్రిల్ 26వ తేదీన చర్లపల్లి(రైలు నంబర్ 07588) నుంచి బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో బరౌనీ - చర్లపల్లి (07589) రైలు ఏప్రిల్ 28న నడుస్తుంది.
ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20, 2026 ఉదయం 08:00 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
{{/usCountry}}ఈ రైళ్లకు సంబంధించిన రిజర్వేషన్ ప్రక్రియ ఏప్రిల్ 20, 2026 ఉదయం 08:00 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ ద్వారా లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్ల వద్ద తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
{{/usCountry}}