చర్లపల్లి - తిరుచానూర్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే తీపి కబురు అందించింది. ఈ మార్గంలో నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలు వేగాన్ని పెంచడంతో పాటు…. దానికి ‘సూపర్‌ఫాస్ట్’ హోదాను కల్పిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
రైలు నంబర్లు - వేళల్లో మార్పులు

సూపర్‌ఫాస్ట్ కేటగిరీకి మార్చిన నేపథ్యంలో ఈ రైళ్ల నంబర్లలో కూడా మార్పులు చేశారు. ఈ కొత్త నిబంధనలు, వేళలు 2027 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
- చర్లపల్లి - తిరుచానూర్ (రైలు నంబరు: 12729) : ఇప్పటివరకు 17047 నంబర్‌తో నడుస్తున్న చర్లపల్లి-తిరుచానూర్ ఎక్స్‌ప్రెస్ ఇకపై 12729 నంబరుతో సేవలు అందిస్తుంది. ఈ రైలు ప్రతిరోజూ చర్లపల్లిలో సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు తిరుచానూర్ చేరుకుంటుంది. దీని నిష్క్రమణ, చేరుకునే సమయాల్లో ఎలాంటి మార్పు లేదు.
- తిరుచానూర్ - చర్లపల్లి (రైలు నంబరు: 12730) : ప్రస్తుతం 17048 నంబర్‌తో నడుస్తున్న తిరుచానూర్-చర్లపల్లి రైలు నంబరు 12730గా మారనుంది. ఈ రైలు తిరుచానూర్‌లో సాయంత్రం 4.55 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 6.00 గంటలకే చర్లపల్లికి చేరుకుంటుంది. వేగం పెంచడం వల్ల ఇప్పటివరకు ఉదయం 7.00 గంటలకు చేరుకునే ఈ రైలు, ఇకపై ఒక గంట ముందుగానే గమ్యస్థానానికి చేరుకోనుంది.
6 సూపర్‌ఫాస్ట్ రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు
ఒకవైపు చర్లపల్లి రైలుకు సూపర్‌ఫాస్ట్ హోదా కల్పించగా….. మరోవైపు జోన్ పరిధిలో నడిచే ఆరు సూపర్‌ఫాస్ట్ రైళ్లను సాధారణ మెయిల్/ఎక్స్‌ప్రెస్ కేటగిరీకి మారుస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఈ మార్పులు 2027 జనవరి 2 మరియు 3 తేదీల నుంచి అమల్లోకి వస్తాయి.
- హైదరాబాద్ – ముంబయి సీఎస్టీ : ప్రస్తుతం ఉన్న 22731 నంబరు ఇకపై 17081గా మారుతుంది.
- ముంబయి సీఎస్టీ – హైదరాబాద్: 22732 నంబరు ఇకపై 17082గా నడుస్తుంది.
- కాచిగూడ – కుంతా: 12789 నంబరు 17689గా మారుతుంది. కుంతా – కాచిగూడ: 12790 నంబరు 17690గా మారనుంది.
- నర్సాపూర్ – నాగర్సోల్: 12787 నంబరు 17241గా నడుస్తుంది.
- నాగర్సోల్ – నర్సాపూర్: 12788 నంబరు ఇకపై 17242గా సేవలందిస్తుంది.

ప్రయాణికులు ఈ నంబర్లు, సమయాల్లో వచ్చిన మార్పులను గమనించి తమ ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.